![]() |
![]() |

ఏమైనా ఈ వారం సినీ ప్రేమికుల రాశి ఫలం ఒక రేంజ్ లో ఉందనుకుంటా!. లేదంటే ఒకటా రెండా ఏడు సినిమాలు సినీ ప్రేమికుల కోసం పోటాపోటీగా థియేటర్స్ లో అడుగుపెడుతున్నాయి. దీంతో ఈ వారం సినీ ప్రేమికులని కదిలిస్తే చాలు సదరు చిత్రాలు విశేషాలని చెప్తూనే ఉంటారు. మరి ఆ సినిమాల లిస్ట్ చూద్దాం.
ముందుగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం సమంత లీడ్ రోల్‌లో చేసిన 'మా ఇంటి బంగారం'. నందిని రెడ్డి దర్శకత్వంలో 100 శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన యువతి, తన గతాన్ని దాచుకుని ఎలా సర్దుకుపోయింది, ప్రమాదం ఎదురైనప్పుడు తన పోరాట పటిమని ఎలా చూపించింది అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యాక్షన్ కామెడీ డ్రామా రూపొందింది. రిలీజ్ డేట్ 19 .
మరోవైపు హారర్ కామెడీ జానర్‌ని ఇష్టపడే సినీ అభిమానుల కోసం 'చెట్టు మీద దయ్యం నాకేం భయం' అనే చిత్రం 18 నే వస్తుంది. తల్లాడ సాయికృష్ణ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక పాడుబడిన ఫామ్‌హౌస్‌లో పరిశోధన కోసం వెళ్లిన నలుగురు యువకులకు ఎదురైన భయానక, నవ్వులు పూయించే వింత సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు విలక్షణ నటుడు విజయ్ ఆంటోని 'నూరు సామి' (తెలుగు టైటిల్ నూరు దేవుళ్ళు) 19 న రిలీజ్ కానుంది. సమాజంలో ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని అందిస్తూ సాగే ఎమోషనల్ కంటెంట్ డ్రామాగా నిలవనుంది.
Also read: నేరుగా ఆహా వేదికగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. పేరు తెలిస్తే షాక్ అవుతారు
సీనియర్ నటుడు వడ్డే నవీన్ రీఎంట్రీ ఇస్తూ చేసిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' (త్రిమూర్తులు బదిలీ) సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఒక సామాన్య పోలీస్ కానిస్టేబుల్ జీవితంలో జరిగే బదిలీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 19 రిలీజ్ డేట్. అలాగే వారణాసి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన భావోద్వేగాల చిత్రం 'చిన్న చిన్న ఆసై', వన్ సైడ్ లవ్ స్టోరీ నేపథ్యంతో వస్తున్న రొమాంటిక్ డ్రామా 'దీవానా' కూడా జూన్ 19న విడుదల కాబోతున్నాయి. సామాజిక కోణంలో ప్రయోగాత్మకంగా వస్తున్న 'LGBT: ఒక న్యాయ పోరాటం' అనే మూవీ సైతం 19 నే వస్తుంది. ఇలా ఏడూ వైవిధ్యమైన కంటెంట్ తో కూడిన చిత్రాలు ఒకే వారంలో రిలీజ్ అవుతూ సినీ ప్రేమికులని, తెలుగు ప్రేక్షకులని చూసి అసూయ పడే పరిస్థితిని కల్పిస్తున్నాయి.
![]() |
![]() |