![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan),ఉపాసన(Upasana)టాలీవుడ్‌లోనే మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. నిన్న జూన్ 14 ఆ ఇద్దరి వివాహ వార్షికోత్సవం. ఆ ఇద్దరి వివాహం 2012 లో అభిమానులు, కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరిగింది. దీంతో అప్పట్నుంచి ప్రతి సంవత్సరం అభిమానులు చరణ్, ఉపాసన కి పెళ్ళి రోజు శుభాకాంక్షలు చెప్తుంటారు. సాధారణంగా మెగా కుటుంబంలో ఏ చిన్న వేడుక జరిగినా అభిమానుల్లో ఆనందం అంబరాన్నంటుతుంది. అయితే ఈ ఏడాది చరణ్ దంపతుల వెడ్డింగ్ యానివర్సరీ మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకాలా మారింది.
పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా ఇటీవలే ఈ భూమ్మీదకి వచ్చిన తమ ఇద్దరు కవల పిల్లల చేతులు చూపిస్తూ పిక్స్ షేర్ చేసింది. ఆ ఇద్దరు పుట్టిన దగ్గరనుంచి ఎటువంటి పిక్స్ షేర్ చెయ్యని చరణ్, ఉపాసనలు కవల పిల్లల ఫోటో షేర్ చేయడంతో నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. రామ్ చరణ్, ఉపాసనలకు ఇప్పటికే క్లిన్ కారా (Klin Kaara) అనే కుమార్తె ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రేజీ పిక్ క్షణాల్లోనే సోషల్ మీడియాని షేక్ చేస్తూ వైరల్‌గా మారిపోయింది. అభిమానులు కంగ్రాట్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. అయితే ఈ వైరల్ ఫోటో వెనుక ఉన్న అసలు రహస్యాన్ని తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఆరాటపడ్డారు.
Also read: Nagarjuna: నాగార్జునతో మూవీపై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్

చరణ్ తో పాటు అభిమానులు ప్రస్తుతం 'పెద్ది' సక్సెస్ మోడ్ లో ఉన్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల కలెక్షన్స్ ని సాధిస్తూ అప్రహాతీతంగా దూసుకుపోతుంది.
![]() |
![]() |