![]() |
![]() |
.webp)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కెరీర్ లోనే మోస్ట్ హయ్యస్ట్ బడ్జెక్టు అండ్ హయ్యెస్ట్ టెక్నాలజీ మూవీ 'రాకా'(Raaka). ప్రచార చిత్రాల్లో కనపడిన అల్లు అర్జున్ లుక్ తో పాటు 'పుష్ప 2' తర్వాత వస్తున్న మూవీ కావడం, జవాన్ తర్వాత అట్లీ నుంచి వస్తున్న మూవీ కూడా రాకా" నే కావడంతో నుంచి అయితే అంచనాలు పాన్ ఇండియా స్థాయి దాటి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్లాయని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీకి సంబంధించి ఫిల్మ్‌నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. నెక్స్ట్ ఇయర్ లో పుష్ప 2 రిలీజ్ డేట్ కి రిలీజ్ చేయబోతున్నారని టాక్. అంటే 2027 డిసెంబర్ 6 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. నిజానికి, ఈ భారీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్‌ని 2027 ఆరంభంలోనే లేదా సమ్మర్ కి తీసుకురావాలని చిత్ర బృందం మొదట ప్లాన్ చేసింది. కానీ, తాజా సమాచారం ప్రకారం పుష్ప 2 డేట్ పక్కా అని అంటున్నారు.
సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ 800 కోట్ల భారీ బడ్జెట్‌తో 'రాకా'ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ కోసం లోలా వీఎఫ్ఎక్స్, ఐరన్‌హెడ్ స్టూడియోస్, లెగసీ ఎఫెక్ట్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో మేకర్స్ చేతులు కలిపారు.
పునర్జన్మలు, సరికొత్త ప్రపంచం అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌ను కలగలిపి అట్లీ ఈ కథని సిద్ధం చేశారు. కేవలం విజువల్స్ మాత్రమే కాదు, ఈ చిత్రంలోని స్టార్ కాస్టింగ్ కూడా మైండ్ బ్లాక్ చేస్తోంది. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకోన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి అగ్ర కథానాయికలు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. సాయి అభ్యంకర్ మ్యూజిక్.
.webp)
![]() |
![]() |