Home  »  News  »  Peddi: కోడి రామ్మూర్తి నాయుడు ఇంటికి పెద్ది టీమ్.. వీరఘట్టంలో హల్ చల్

Updated : Jun 12, 2026

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)'పెద్ది'(Peddi)తో తన సత్తా చాటుతూ 350 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఉత్తరాంధ్ర యువకుడిగా చరణ్ చేసిన కుస్తీ రోల్ కి మంచి పేరు వస్తుంది. దీంతో అందరు తెలుగు నేల గర్వించదగ్గ మహా యోధుడు, తన అసాధారణ శారీరక బలంతో ప్రపంచ దేశాలని  సైతం ఆశ్చర్యపరిచిన 'కలియుగ భీమ' , ఉత్తరాంధ్ర వాసి  కోడి రామ్మూర్తి నాయుడు గారుని గుర్తు చేసుకుంటున్నారు. మూవీలో శివ రాజ్‌కుమార్ పోషించిన 'గౌరనాయుడు' క్యారక్టర్ ని కోడి రామ్మూర్తి నాయుడు శిష్యుడుగా చూపించారు.

 దర్శకుడు బుచ్చిబాబు సైతం 'గౌరనాయుడు' క్యారక్టర్ ని కోడి రామ్మూర్తినాయుడు(kodi Ramamurthy Naidu) గారి జీవిత స్ఫూర్తితోనే  మలిచాడు. ఈ చారిత్రాత్మక బంధాన్ని గౌరవిస్తూ, చిత్ర విజయయాత్రలో భాగంగా 'పెద్ది' టీమ్ ఒక కీలకమైన పర్యటనకి  శ్రీకారం చుట్టింది. ఈ ప్రత్యేక పర్యటనలో భాగంగా బుచ్చిబాబు, పెద్ది నిర్మాత వెంకట సతీష్, సాంగ్స్ రాసిన  లిరిసిస్ట్ అనంత శ్రీరామ్  ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గ పరిధిలోని  వీరఘట్టం గ్రామానికి వెళ్తున్నారు. అక్కడ నివసిస్తున్న కోడి రామ్మూర్తి నాయుడు గారి స్వయానా మనవడైన వెంకట్రావుని చిత్ర యూనిట్ మర్యాదపూర్వకంగా కలవనుంది.

Also read: Anna lezhneva: అన్నాలెజినోవా ఎమోషనల్ పోస్ట్.. అసలు ఈ పోస్ట్ ఎవరు ఉహించి ఉండరు  

బ్రిటీష్ కాలంలో 1911 లో మద్రాస్ ప్రభుత్వ అధికారుల ముందే తన గుండెపై ఏనుగుని  ఐదు నిమిషాల పాటు ఉంచుకుని, రెండు చేతులతో కదులుతున్న మోటార్ కార్లని  ఆపి, గొలుసులను తెంచిన ఆ 'ఇండియన్ హెర్క్యులస్'రామ్మూర్తి నాయుడు ఘనతని, ఈ తరం సినిమాతో ఎలా ముడిపెట్టారో వారి కుటుంబ సభ్యులతో పంచుకోనున్నారు. ఆ కాలంలోనే సర్కస్ కంపెనీ ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయల సంపదని  భారత స్వతంత్ర  ఉద్యమానికి, దానధర్మాలకి ఇచ్చేసిన ఆ మహనీయుని వారసులని  కలవడం  ఒక అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. దీంతో పర్యటనపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, స్థానిక ప్రజల్లోను ఆసక్తి,ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన ద్వారా సినిమా కేవలం వినోదం మాత్రమే కాకుండా, తెలుగు మట్టి వీరుల చరిత్రని  గౌరవించే  అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.