Home  »  News  »  జీవీ ప్రకాష్‌ను ఇసుకలో పాతిపెట్టిన అనిల్ రావిపూడి!

Updated : Jun 12, 2026

విక్టరీ వెంకటేష్ (Venkatesh), సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)ల కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ చేశాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా నటిస్తుండటం విశేషం. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన తాజా అప్‌డేట్‌తో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) రంగంలోకి దిగారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో సాగిన ఈ వీడియో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. జంధ్యాల 'వివాహ భోజనంబు' సినిమాలోని కామెడీ సీన్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ అనౌన్స్‌మెంట్ వీడియో చేయడం విశేషం.

ఈ వీడియోలో అనిల్ రావిపూడి, జీవీ ప్రకాష్‌ని ఒక బీచ్‌ ఒడ్డున ఇసుకలో పాతిపెట్టడం హైలైట్‌గా నిలిచింది. సరికొత్తగా ట్యూన్స్ రాబట్టడం కోసమే జీవీ ప్రకాష్‌ను అలా ఇసుకలో కూర్చోబెట్టినట్లు అనిల్ రావిపూడి తనదైన శైలిలో నవ్వులు పూయించారు. క్లాస్ పాట, మాస్ పాట, మెలోడీ పాట, ఎమోషనల్ పాట, డీజే పాట అంటూ తనకు ఎలాంటి పాటలు కావాలో అనిల్ డిమాండ్ చేయడం సరదాగా సాగింది.

ఇక ఈ సరదా సంభాషణ మధ్యలోకి ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వడం మరో పెద్ద సర్‌ప్రైజ్. ఆయనను కూడా ఇసుకలోనే పాతిపెట్టడం, అక్కడి నుంచే ఆయన "మాస్ పాట, క్లాస్ పాట, అనిల్ గారు ఓకే చేసిన పాట" అంటూ అందుకోవడం నవ్వులు పూయించారు.

జీవీ ప్రకాష్ కుమార్ తన అద్భుతమైన మ్యూజిక్‌తో ఈ చిత్రానికి పెద్ద అసెట్‌గా మారబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం, అనిల్ రావిపూడి కెరీర్‌లో మరో హిట్‌గా నిలవడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కాంబినేషన్ మళ్లీ థియేటర్లలో నవ్వుల జల్లు కురిపించడం ఖాయమని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

https://x.com/Theteluguone/status/2065384107581084142






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.