![]() |
![]() |

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan)తన వన్ మాన్ షో 'పెద్ది' తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. మూవీ చూసిన వాళ్లంతా చరణ్ పెర్ఫార్మ్ మెస్మరైజ్ చేసిందని చెప్తున్నారు. ఇక ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 135 .36 కోట్ల రికార్డు గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.
ఇక రెండో రోజు ఓవర్సీస్ తో కలుపుకొని 60 కోట్ల గ్రాస్ ని సాధించట్టుగా ట్రేడ్ సర్కిల్స్ న్యూస్. మొదటి రోజు కలెక్షన్స్ వివరాలని అధికారకంగా ప్రకటించిన మేకర్స్ రెండో రోజు కలెక్షన్స్ పై కూడా పోస్టర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. థియేటర్ల ఆక్యుపెన్సీ పరంగా కూడా తెలుగు వెర్షన్ అద్భుతమైన ప్రదర్శన కంపరుస్తుంది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సగటున 48.81 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం షోలకు 29.85 శాతంతో ప్రారంభమై, మధ్యాహ్నానికి 48.15 శాతానికి, సాయంత్రం షోలకు 57.08 శాతానికి పెరిగింది. ఇక నైట్ షోల సమయానికి అత్యధికంగా 60.15 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడాయి.
Also read: Nagababu vs prakash raj: మేము గొర్రెలం కాదు
![]() |
![]() |