![]() |
![]() |

అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతూ వీరభద్రుడు(Veerabadh ఉరఫ్ కరుప్పు ఇంకా థియేటర్స్ లోకి అడుగుపెట్టలేదు. ఉదయం తొమ్మిది గంటల షో పడకపోయినా, మార్నింగ్ షో అయినా పడుతుందని అనుకున్నారు. అది లేదు. మాట్నీ తో అయినా వస్తుందని అనుకున్నారు. అది కూడా లేదు. రీసెంట్ గా ఈ విషయమై వీరభద్రుడు దర్శకుడు ఆర్ జె బాలాజీ ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసాడు.
సదరు వీడియోలో బావోద్వేగానికి గురవుతు రెండేళ్ల కష్టాన్ని వెండితెరపై చూసుకోవాలని ఆశపడ్డాను. కానీ ఇలాంటి ఆటంకాలు రావడం నన్ను కలిచివేస్తుంది. ఉదయం షోల కోసం థియేటర్ల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా క్షమాపణలు. ఇది నా తప్పు కాకపోయినా, దర్శకుడిగా నేను బాధ్యత వహిస్తున్నాను.
Also read: Ram Pothineni: వైల్డ్ యాక్షన్ లోకి రామ్ పోతినేని.. బిగ్ అప్డేట్ కి డేట్, టైం ఫిక్స్
రిలీజ్ కి సంబంధించి కొన్ని ఆర్థిక సమస్యలు KDM ఇష్యూస్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి నిర్మాతలు శ్రమిస్తున్నారు. సూర్య సార్ సినిమా అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. దయచేసి మాపై నమ్మకం ఉంచండి. సాయంత్రం ఆరుగంటల షోస్ స్టార్ట్ అవుతాయని సదరు వీడియోలో చెప్పుకొచ్చాడు.
.webp)
![]() |
![]() |