![]() |
![]() |

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు సరికొత్త రికార్డులకు సిద్ధమవుతోంది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి సంచలన విజయాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ సంస్థ, ఇప్పుడు అంతర్జాతీయ పంపిణీ (Overseas Distribution) రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' (PEDDI) ఈ ప్రయాణంలో హోంబలే ఫిల్మ్స్‌కు తొలి వెంచర్ కావడం విశేషం.
గత కొన్నేళ్లుగా రూటెడ్ స్టోరీలను భారీ విజువల్ వండర్స్‌గా మలిచి ప్రేక్షకుల మన్ననలు పొందిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు నేరుగా ఓవర్సీస్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాల్లో ఒకటైన 'పెద్ది'తో తమ అంతర్జాతీయ ఫుట్‌ప్రింట్‌ను మరింత బలోపేతం చేయాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. ఈ భారీ డీల్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

'పెద్ది' సినిమాకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఒక సరికొత్త, ఇంటెన్స్ లుక్‌లోకి మారడం ఇప్పటికే ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. గ్రామీణ నేపథ్యంలో ఒక పవర్ ఫుల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.
హోంబలే ఫిల్మ్స్ వంటి సక్సెస్ ఫుల్ బ్రాండ్ తోడవడంతో, 'పెద్ది' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో భారీ ఓపెనింగ్స్ లభిస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా వంటి కీలక మార్కెట్లలో ఈ చిత్రాన్ని అత్యంత భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ క్రేజ్, బుచ్చిబాబు మేకింగ్, హోంబలే ఫిల్మ్స్ పంపిణీ వ్యూహాలు అన్నీ కలిసి 'పెద్ది'ని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్‌గా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
![]() |
![]() |