![]() |
![]() |

స్టార్ హీరో సూర్య(Suriya)నుంచి సినిమా వస్తుందంటే తమిళ, తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ కోవలోనే ఈ రోజు వీరభద్రుడు(తమిళ్ లో కరుప్పు) అడుగుపెడుతుండటంతో తెల్లవారుజాము నుండే థియేటర్ల వద్ద సూర్య ఫ్యాన్స్ తమ సందడిని మొదలు పెట్టారు.
కానీ తమిళ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. సదరు రద్దుపై నిర్మాత అభిమానులని, ప్రేక్షకులని క్షమాపణ కోరడం జరిగింది. ఉదయం ఆట ఆగడానికి కేడియం ఇష్యూ తో పాటు డిజిటల్ సకాలంలో థియేటర్లకి అందకపోవడం వల్ల ప్రదర్శన నిలిచినట్టుగా తెలుస్తుంది. పైగా కొన్ని ఏరియాలకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు సెటిల్ కాకపోవడం కూడా షోల రద్దుకు కారణమని సమాచారం.
Also read: NTR: చైనాలో వంద రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఎన్టీఆర్ దే
షో రద్దుతో ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం ఆట నుంచి షో సజావుగా ప్రదర్శించబడేలా డిస్ట్రిబ్యూటర్లు చర్యలు తీసుకుంటున్నారు. సూర్య సరసన త్రిష జంటగా చేయగా ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. ఆర్ జె బాలాజీ దర్శకుడు.
![]() |
![]() |