![]() |
![]() |

స్టార్ హీరో సూర్య(Suriya)కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సినిమా వస్తుందంటే చాలు పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ కోవలోనే రేపు 'వీరభద్రుడు' గా (తమిళంలో 'కరుప్పు') తెలుగు, తమిళ నాట అడుగుపెడుతున్నాడు. అయితే తెలుగు వెర్షన్ లో ఇంకా ఎలాంటి మూమెంట్, బజ్ కనిపించడం లేదు.
సాధారణంగా సూర్య సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉంటాయి. కానీ వీరభద్రుడు ఆ విషయంలో వెనుకబడి ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా బుకింగ్స్ చాలా సాధారణంగా ఉన్నాయి. మునుపటి సినిమా రెట్రో తో పోలిస్తే బుకింగ్స్ 50% కంటే తక్కువగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్
ప్రమోషన్స్ తెలుగులో తక్కువగా జరగడం, నీరసానికి ప్రధాన కారణాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి సాలిడ్ మౌత్ టాక్ వస్తే కానీ రేపు మార్నింగ్ షోస్ తర్వాత బుకింగ్స్ ఊపందుకుంటాయేమో చూడాలి. సూర్య సరసన త్రిష(Trisha)జత కట్టగా ఆర్జే బాలాజీ(Rj Balaji)తెరకెక్కించాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మాణం
![]() |
![]() |