Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ 

Updated : May 13, 2026

 

 

తగ్గేదేలే అనే రీతిలో పలు ఆసక్తికర తెలుగు సినిమా వార్తలు తెలుగు సినిమా ప్రేమికులు, పాఠకుల కోసం అందుబాటులో ఉన్నాయి. 

1 . నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు 

నా పేరుతో టీ షర్ట్స్ ని ఒక సంస్థ విక్రయిస్తుందని కొన్ని రోజుల క్రితం నాగార్జున ఢిల్లీ హై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్పందిస్తు నాగార్జునతో  నేరుగా ఒప్పందం లేనప్పుడు  ఆయన పేరు, ఫోటోలని వాడుకుంటూ టీ షర్టులు ఎలా అమ్ముతారు.  మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా హక్కులు పొందామని చెప్తే సరిపోతుందా!  ప్లెయింటిఫ్ తో మీకు పరిచయం కూడా లేనప్పుడు  ఆ వస్తువులని  అమ్మే చట్టబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది. అనుమతి పాత్రలు ఉన్నాయా అని  ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.

 

2. విజయ్ ఇక సెకండ్ ప్లేస్ లోనే 

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయాల్లో  తనకంటు ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్న దళపతి  విజయ్ మరో అరుదైన ఘనతని  సొంతం చేసుకున్నారు. ప్రముఖ సినిమా వెబ్ సైట్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో విజయ్  రెండో స్థానాన్ని  కైవసం చేసుకున్నాడు. అంతకు ముందు వారంలో 21 వ స్థానంలో ఉన్న విజయ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ కి రావడం విశేషం.

3 . భోపాల్‌లో ‘పెద్ది’ సౌండ్.. థర్డ్ సాంగ్ లాంచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది నుంచి తాజాగా  మ్యూజికల్ ప్రమోషన్స్‌ కి సంబంధించిన శుభవార్త బయటకు వచ్చింది. 'సౌండ్ ఆఫ్ పెద్ది'  పేరుతో మే 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో స్పెషల్ సాంగ్‌ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌లో  రెహమాన్ స్వయంగా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన స్వరపరిచిన బాణీలకి స్టేజ్ పై లైవ్ మ్యూజిక్ తోడైతే, ఆ వైబ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.

4 . బాలకృష్ణ, ఎన్టీఆర్ మల్టీస్టారర్!

గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ, మాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ మల్టిస్టారర్ చెయ్యాలి అనే డిమాండ్ ఎప్పట్నుంచో ఫ్యాన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా  సోషల్ మీడియా వేదికగా మళ్ళీ తమ కోరికని వ్యక్తం చేస్తున్నారు. మరి వాళ్ళ కోరికని బాలయ్య, ఎన్టీఆర్ తీరుస్తారేమో చూడాలి. బాలయ్య ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. 

 5 . IBOMMA మళ్లీ వచ్చేసింది!

కొంతకాలంగా నిలిచిపోయినట్లు కనిపించిన IBOMMA వెబ్‌సైట్ తాజాగా మళ్లీ ఆన్‌లైన్‌లో కనిపించడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సైట్‌ ని ఆపరేట్ చేస్తున్నాడనే ఆరోపణలతో రవిని పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయగా.. సైట్ కూడా క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాలతో సైట్ యాక్టివ్ కావడం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ పరిణామంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  రవి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న  విషయం తెలిసిందే.


6 . మెగాస్టార్ చిరంజీవి జెన్ జీ  లుక్ వైరల్ 

మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎంతో స్లిమ్‌గా, స్టైలిష్‌గా జెన్ జీ లుక్ లో  యువ హీరోలకి సైతం పోటీ ఇచ్చేలా ఉన్నారు. దీంతో సదరు స్టిల్స్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. 
గత కొంతకాలంగా చిరు కఠినమైన డైట్ క్రమశిక్షణతో కూడిన వర్కవుట్స్ చేస్తున్నారు.  అందుకే అంత ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని సినీ వర్గాల టాక్.


7 .  క్షమాపణలు చెప్తున్న అలీ

హిందువులని అవమానించే రీతిలో ఉన్న సోప్ యాడ్ చేసి ప్రముఖ నటుడు అలీ అపఖ్యాతికి గురైన విషయం తెలిసిందే. హిందువులు సోషల్ మీడియా వేదికగా అలీపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  గతంలో తాను నటించిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమాలోని ఒక పాపులర్ కామెడీ సీన్‌ని  స్ఫూర్తిగా తీసుకుని ముంబైకి చెందిన కంపెనీ ఈ యాడ్ రూపొందించింది 
దాంతో  కేవలం వినోదం కోసమే ఆ యాడ్ చేశాను. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదు. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు.

8 .  పూజాహెగ్డే కి అండగా అల్లు అర్జున్!


పూజాహెగ్డే ఇటీవల కెరీర్ పరంగా కొంచం డల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రంలో తనకి అవకాశం ఇవ్వబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. అట్లీ మూవీతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. పూజా, అల్లు అర్జున్ కాంబోలో ఇప్పటికే డి జె జగన్నాధం, అల వైకుంఠ పురం వచ్చి మంచి విజయాలు అందుకున్నాయి.

9 . వారణాసిలో వారణాసి’ షూటింగ్?

మహేశ్‌బాబు  రాజమౌళి  ల ‘వారణాసి’షూటింగ్ ఇప్పుడు అసలు లెవల్‌కి  వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. భారీ అండర్‌వాటర్ యాక్షన్ సీన్‌ని వారణాసిలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మొదట ఈ సన్నివేశాన్ని హైదరాబాద్‌లో షూట్ చేయాలని అనుకున్నారు. కానీ 150 ట్యాంకర్ల నీటి సరఫరాకి జలమండలి అనుమతి ఇవ్వకపోవడంతో వారణాసికి షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి .

10 . నట్టి కుమార్ రాజీనామా

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్  జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు తాను పంపిన రాజీనామా లేఖలో 'ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో పారదర్శకత లోపించింది. కొందరు సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న నిర్మాతలకి  అన్యాయం జరుగుతుంది. థియేటర్ల కేటాయింపు, వర్చువల్ ప్రింట్ ఫీజు వంటి విషయాల్లో కౌన్సిల్ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది. కేవలం కొందరి ప్రయోజనాల కోసమే  కౌన్సిల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు  తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.