Home  »  News  »  Michael Jackson: మైఖేల్ జాక్సన్ బతికే ఉన్నాడా!. ఫేక్ డెత్ ప్లాన్ చేసింది నిజమేనా!

Updated : May 13, 2026

మైఖేల్ జాక్సన్.. ప్రపంచ పాప్ సంగీత చక్రవర్తిగా, గాయకుడిగా  తను సృష్టించిన సంచలనాలు గురించి చెప్పుకోవాలంటే పెట్టి పుట్టాలి. తన ప్రోగ్రాం వస్తే చాలు ఎంతటి వ్యక్తి అయినా తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం కష్టం. అంతటి సమ్మోహన శక్తి మైఖేల్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక శిఖరం కూడా. ఆయన మరణించి దశాబ్ద కాలంపైనే దాటిపోయింది. 2009లో ఆ మరణవార్త విని ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. కానీ ఆయన మరణంపై ఏదో ఒక మూల అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో జాక్సన్ అభిమానుల్లో మళ్ళీ కొత్త చర్చకు దారితీసింది.

 అచ్చు మైఖేల్ జాక్సన్ లాగే ఉన్న వ్యక్తి బస్ లో ప్రయాణం చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే మైకేల్ ఇప్పటికి బతికే ఉంటే ఎంత వయసుతో ఉండేవాడో అంతే ఏజ్ తో ఉన్నాడు. ఏఐ అనుకుందామంటే బస్ లో మిగతా పాసెంజర్స్ క్లియర్ గా కనిపిస్తున్నారు.   దీంతో అభిమానులు స్పందిస్తు 'జాక్సన్ చనిపోలేదు, ఎక్కడో రహస్యంగా జీవిస్తున్నారు అనే కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఆయన అంత్యక్రియల సమయంలో బాక్స్ ఖాళీగా ఉందని, తన మరణాన్ని నాటకమాడి విదేశాలకు పారిపోయారని అనేక కాన్సిపిరసీ థియరీలు (Conspiracy Theories) పుట్టుకొచ్చాయి.

Also read: ILaya Thalapathy: నెక్స్ట్ ఇళయ దళపతి ఎవరు.. ఈ హీరో అవుతాడా!  

 మరికొందరు మాత్రం ఇది ఖచ్చితంగా AI (Artificial Intelligence) సృష్టించిన చిత్రం లేదా 'డీప్ ఫేక్' టెక్నాలజీ మాయాజాలమని కొట్టిపారేస్తున్నారు. విశ్లేషకులు మాత్రం   ప్రపంచవ్యాప్తంగా మైఖేల్ జాక్సన్ లాగే కనిపించే 'ఇంపర్సనేటర్లు' వేలల్లో ఉన్నారు. తాజాగా వైరల్ అయిన ఫోటో అటువంటి ఒక కళాకారుడిది అయి ఉండవచ్చని  భావిస్తున్నారు. కానీ చాలా మంది ఎప్పటి నుంచో నమ్ముతున్న విషయం ఏంటంటే జాక్సన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిడి, అప్పుల నుండి తప్పించుకోవడానికే  'ఫేక్ డెత్' ప్లాన్ చేశాడని చాలా బలంగా నమ్ముతుంటారు.

           






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.