Home  »  News  »  ILaya Thalapathy: నెక్స్ట్ ఇళయ దళపతి ఎవరు.. ఈ హీరో అవుతాడా!  

Updated : May 12, 2026

 


-ఇళయదళపతి విజయ్ ఇక  సిఎం విజయ్  
-మరి నెక్స్ట్ ఇళయ దళపతి  ఎవరు 
-ఏ హీరోకి అవకాశం ఉండవచ్చు 
-అసలు పోటీలో ఉన్న వాళ్ళు ఎవరు 
-ఆ డీటెయిల్స్ చూద్దాం 


సుమారు మూడు దశాబ్దాల పాటు తనదైన నటన, డ్యాన్స్, మేనరిజమ్స్‌తో కోలీవుడ్ బాక్సాఫీస్‌ని ఏలిన  ఇళయదళపతి విజయ్(VIjay)సినిమాలకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి' అనే పేరు కేవలం ఒక బిరుదు మాత్రమే కాదు. ఆ పేరు వెనక ఒక భారీ సామ్రాజ్యం ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ వదిలి వెళ్తున్న ఆ సింహాసనాన్ని అధిష్టించే తదుపరి 'దళపతి' ఎవరు అనే చర్చ తమిళ చిత్ర సీమతో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది


విజయ్ తో సమానంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్(Ajith). ఒక టైంలో అజిత్ ని ఉద్దేశించి తమిళనాడు మాజీ ముఖ్యమంతి జయలలిత మాట్లాడుతు నా తర్వాత నా రాజకీయ వారసుడు అజిత్ అని చెప్పారు. అంతటి శక్తీ అజిత్ సొంతం. అసలు మొన్న ఎలక్షన్స్ లో అజిత్ కనుక అన్నా డిఎంకె కి సపోర్ట్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే మాటలు కూడా వినపడ్డాయి. తన వ్యక్తిగత ఇష్టాలు, బైక్ రేసింగ్ వంటి కారణాల వల్ల ఏడాదికి ఒక మూవీ మాత్రమే చేస్తుంటాడు. ప్రస్తుత కోలీవుడ్ టాక్ ప్రకారం, విజయ్ వారసుడిగా శివకార్తికేయన్ పేరు బలంగా వినిపిస్తోంది. విజయ్ తరహాలోనే పిల్లలు, కుటుంబ ప్రేక్షకులలో ఆయనకు మంచి క్రేజ్ ఉంది. 'అమరన్' సినిమా విజయంతో ఆయన మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత వరుస చిత్రాలు ఫెయిల్.


Also read: Nagarjuna: నాగార్జున విషయంలో హైకోర్ట్ కీలక తీర్పు.. అనుమతి పత్రాలు చూపండి అని ఆదేశాలు 

సూర్య అండ్  ధనుష్: సూర్యకు గ్లోబల్ వైడ్ గుర్తింపు ఉన్నప్పటికీ కథలపై ప్రత్యేక శ్రద్ద చూపించడం లేదు.  ధనుష్ వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. వీరిద్దరూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ రాణిస్తున్నారు. గత కొంతకాలంగా కోలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సినిమాల కలెక్షన్లను బట్టి తదుపరి సూపర్ స్టార్ ఎవరనేది అంచనా వేస్తున్నారు. విజయ్ సినిమాలకి వచ్చే 500 , 600 కోట్ల వసూళ్లని  అందుకోవడం సామాన్యం కాదు. శివకార్తికేయన్ ఎదుగుదల ఆశాజనకంగా ఉన్నప్పటికీ, విజయ్ రేంజ్ మాస్ అప్పీల్ సాధించడానికి ఇంకా సమయం పడుతుందని కొందరి అభిప్రాయం.ఏది ఏమైనా ప్రకృతిలో మార్పులు ఎలా అయితే సహజమో  సినిమా రంగంలో మార్పు కూడా సహజం. ఒకప్పుడు ఎంజీఆర్, శివాజీ గణేషన్ తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ ఆ స్థానాలని భర్తీ చేశారు. ఆ తర్వాత విజయ్, అజిత్ అగ్రస్థానానికి చేరుకున్నారు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రస్థానం మొదలవుతున్న వేళ, కోలీవుడ్ కిరీటాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.