Home  »  News  »  Jana Nayagan: జననాయగన్ ఓటిటి డీల్ ఇదే! షాకింగ్ ఫిగర్   

Updated : May 12, 2026

 


ఇళయ దళపతి విజయ్(Vijay)వన్ మాన్ షో 'జననాయగన్'(Jana Nayagan)అతి త్వరలోనే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీంతో ఆ శుభ ఘడియల కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తు వస్తున్నారు. పైగా విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న మూవీ కావడంతో, బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అందరు నమ్ముతున్నారు. రీసెంట్ గా 'జననాయగన్' కి సంబంధించిన భారీ అప్‌డేట్ ఒకటి  బయటకు వచ్చింది. 


 'జననాయగన్' ఓటిటి హక్కులని మొదట్లో అమెజాన్ ప్రైమ్ వీడియో పొందిన విషయం తెలిసిందే. కానీ రిలీజ్ లేట్ అవ్వడంతో సదరు సంస్థ ఓటిటి డీల్ ని క్యాన్సిల్ చేసుకుంది. కానీ ఇప్పుడు రిలీజ్ నేపథ్యంలో మళ్ళీ ఓటిటి డీల్ తెరపైకి వచ్చింది. సుమారు 100 కోట్లకి డీల్ పూర్తి చేసుకున్నట్టుగా సమాచారం. గత ఏప్రిల్‌లో జన నాయగన్ లీక్ చిత్ర యూనిట్ ని    కలవరపెట్టింది. దీనివల్ల సుమారు 70 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసిన ప్రముఖ ఓటీటీ సంస్థలు అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గాయి. అయితే, తాజాగా నిర్మాత వెంకట్ కె. నారాయణతో అమెజాన్   జరిపిన చర్చలు విజయవంతమైనట్టుగా తెలుస్తుంది.

Also read: Karthi: సూర్యపై సోదరుడు కార్తీ కీలక వ్యాఖ్యలు.. ఈ సారి హిట్ కొట్టినట్టేనా!


హెచ్. వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే, మమిత భైజు కీ రోల్స్. బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక  ఓటీటీ డీల్ సెట్ అవ్వడంతో  మేకర్స్ ప్రమోషన్లపై దృష్టి సారించనున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.