Home  »  News  »  Godari Gattupaina: గోదారి గట్టుపైన.. చిన్న సినిమాకు ఊహించని కలెక్షన్స్!

Updated : May 11, 2026

ఈ వేసవిలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, చిన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది 'గోదారి గట్టుపైన' (Godari Gattupaina). గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.

సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం, ఈ మూవీ విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3.06 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్లు రావడం విశేషమనే చెప్పాలి. 

"Coolest Summer Entertainer" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులకు నిజంగానే మంచి రిలాక్సేషన్‌ ఇస్తోంది. ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, గోదావరి పరిసరాల అందాలు, సహజమైన నటన ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. 

ప్రస్తుతం థియేటర్లలో పెద్ద పోటీ లేకపోవడం 'గోదారి గట్టుపైన' చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారింది. వీక్ డేస్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.