![]() |
![]() |

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ‘కాంతార’తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ‘కాంతార’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరయ్యాడు. త్వరలో ఆయన మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 2022లో రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'హరికథే అల్ల గిరికథే' ఇప్పుడు తెలుగులో ‘ఏ ఫిల్మ్ బై గిరి’గా విడుదలవుతోంది.
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిషబ్ శెట్టి ఫిలిమ్స్ బ్యానర్స్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో రిషబ్ శెట్టి, రచన ఇందిర్ జంటగా నటించిన ‘ఏ ఫిల్మ్ బై గిరి’ (A Film By Giri) సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా కరణ్ అనంత్, అనిరుద్ మహేష్ ద్వయం దర్శకులుగా పరిచయం అయ్యారు. ఎన్ సందేశ్ ఈ సినిమాను నిర్మించారు.
'ఏ ఫిల్మ్ బై గిరి' చిత్రాన్ని ఎంజి మూవీస్ ద్వారా ఎం అచ్చిబాబు మే 8న తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఎన్.పి తాపెశ్వరి, హోన్నవలి కృష్ణ, ప్రమోద్ శెట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
వాసుకి వైభవ్ సంగీతం అందించిన ఈ సినిమాకు రఘునాథ్ సిఎం సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే భరత్ ఎంసి, ప్రదీప్ అర్ రావు ఈ మూవీకి ఎడిటర్స్.
![]() |
![]() |