Home  »  News  »  Kalki part 2: కల్కి పార్ట్ 2  టైటిల్ మారుతుంది.. ఆ హీరో ఫాన్స్ హ్యాపీ 

Updated : Apr 27, 2026

 


-షూటింగ్ దశలో కల్కి పార్ట్ 2 
-త్వరలోనే ప్రభాస్ జాయిన్ 
-ఈ క్రమంలో క్రేజీ న్యూస్ వైరల్ 


ప్రభాస్(Prabhas)తో పాటు ఫ్యాన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకి మోస్ట్ అవైటింగ్ మూవీ ఏది అంటే కల్కి పార్ట్ 2(Kalki part 2)అని చెప్పవచ్చు. అఫ్ కోర్స్ మేకర్స్ కి కూడా మోస్ట్ అవైటింగ్ మూవీ.  అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కమల్ హాసన్, అమితాబ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ కూడా త్వరలోనే జాయిన్ కాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

కల్కి మొదటి భాగం పేరు కల్కి 2898 ఏడి. దీంతో సెకండ్ పార్ట్ పేరు కల్కి పార్ట్ 2 ఫిక్స్ చేస్తారేమో అనుకుంటూ వస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం, 'కల్కి 2' కి కర్ణ: 3102 BC" అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి భాగంలో  ప్రభాస్ క్యారక్టర్ కర్ణుడిగా రివీల్ అయిన విషయం తెలిసిందే. రెండో భాగానికి క్రీస్తు పూర్వం 3102లో కలియుగం ప్రారంభమైన సమయాన్ని, అలాగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కర్ణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యతని ప్రతిబింబించపోతుంది. దీంతో కర్ణ: 3102 BC  టైటిల్ పవర్ ఫుల్ గా  ఉంటుందని భావిస్తున్నారు. సదరు టైటిల్ పై  చిత్ర యూనిట్ త్వరలోనే  అధికారిక ప్రకటన కూడా చేయబోతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే టైటిల్ ఖరారైతే, ప్రభాస్ అభిమానులకి ఇది అంతకంటే పెద్ద పండగ అని చెప్పవచ్చు. 


Also read: VIJay: సౌత్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసారు..ఇక సినిమాలు చేయడానికి వీల్లేదు

మొదటి భాగంలో భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెట్టిన నాగ్‌ అశ్విన్, రెండో భాగంలో గతాన్ని భవిష్యత్తుని  అనుసంధానించబోతున్నారు. ముఖ్యంగా మహాభారత కాలంలోని కర్ణుడి యుద్ధ నైపుణ్యం, అశ్వత్థామతో అతని సంబంధం మరియు సుప్రీమ్ యాస్కిన్ అంతం కోసం కల్కి అవతారం ఎలా ఉద్భవిస్తుందనేది ఈ పార్ట్‌లో చూపించబోతున్నారు.  యాక్షన్ ఎపిసోడ్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ మొదటి భాగాన్ని మించి మరింత భారీ స్థాయిలో ఉండనున్నాయి.

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.