Home  »  News  »  The Kerala Story 2: 'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్ డేట్ మారింది!

Updated : Apr 26, 2026

2023లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2' (The Kerala Story 2) వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోయింది. అయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ఎందరో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్  మారింది.

ముందుగా ఈ సినిమాని మే 8వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ మే 1 నుంచే ఓటీటీలో అందుబాటులోకి రానుంది. సమ్మర్ హాలిడేస్, ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'ది కేరళ స్టోరీ 2' డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 1 నుంచి హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన 'ది కేరళ స్టోరీ' పార్ట్-1 కేవలం రూ. 15-20 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో భాగం మాత్రం రూ.50 కోట్ల లోపు వసూళ్లతో సరిపెట్టుకుంది.

 

https://x.com/ZEE5India/status/2048061330100539742






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.