![]() |
![]() |

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (Varanasi) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన సాంగ్ షూటింగ్ పూర్తయింది.
7 రోజుల పాటు భారీ సెట్స్‌లో షూటింగ్
హైదరాబాద్‌లోని భారీ సెట్స్‌లో 7 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ (Bosco Martis) ఈ పాటకు అద్భుతమైన స్టెప్స్ అందించారు. మహేష్ బాబు స్టైలిష్ మూమెంట్స్, ప్రియాంక చోప్రా గ్రేస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్, ప్రియాంకలు బోస్కో మార్టిస్తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి మార్క్ విజువల్ వండర్
ఈ పాటలో విజువల్స్, భారీ సెట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని అంటున్నారు. రాజమౌళి సినిమాల్లో పాటలంటే కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, కథలో భాగంగా సాగే ఒక విజువల్ ట్రీట్. ‘వారణాసి’లో ఈ సాంగ్ ఒక హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ మెక్సికో కామిక్ కాన్ (CCXP) వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితమై రికార్డులు సృష్టిస్తోంది.
కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 7, 2027 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |