![]() |
![]() |

-కార్తికేయ 2 , తండేల్ తో బిగ్ డైరెక్టర్ జాబితాలోకి
-నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్
-ఆ డిటైల్స్ ఇవే
కార్తికేయ 2 , తండేల్ తో హిట్ డైరెక్టర్ అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్నాడు చందు మొండేటి(Chandoo Mondeti). ఇప్పుడు బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహార్(Karan Johar) సారధ్యంలోని ధర్మ ప్రొడక్షన్స్ తో చేతులు కలిపి బిగ్ ప్రాజెక్ట్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఆ చిత్రానికి సంబంధించి బాలీవుడ్ అండ్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న క్రేజీ విశేషాల గురించి చూద్దాం.
రానా దగ్గుబాటి, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఒక భారీ హిస్టారికల్ థ్రిల్లర్ ని చందు మొండేటి ప్లాన్ చేస్తున్నాడు. తన గత చిత్రాలైన 'కార్తికేయ', 'కార్తికేయ 2' తరహాలో పురాణాలు, చరిత్ర మరియు మిస్టరీ అంశాలు మిళితమై ఉండబోతునట్టుగా తెలుస్తోంది. మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలోని చారిత్రక కట్టడాలు, అక్కడి ఆధ్యాత్మిక రహస్యాలను బేస్ చేసుకుని కథ సిద్ధం చేసినట్లు టాక్. రానా, అక్షయ్ ఇద్దరు గతంలో 'బేబీ' లో కలిసి చేసిన విషయం తెలిసిందే. మరో టాలీవుడ్ లేదా బాలీవుడ్ టాప్ హీరో గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది.
Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్
ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన కరణ్ జోహార్ తన సొంత బ్యానర్ 'ధర్మ ప్రొడక్షన్స్' పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడంటే ఈ చిత్ర కథకి ఉన్న ఇంపార్టెన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. మూవీకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

![]() |
![]() |