![]() |
![]() |

-సీతమ్మ తల్లిగా ముస్తాబవుతున్న సాయిపల్లవి
-మలయాళంలో మాట్లాడితే ఎందుకు కోపం
-సాయిపల్లవి చెప్పింది ఏంటి
సాయిపల్లవి ఇక నుంచి భారతీయుల సీతమ్మ తల్లిగా మారనుంది. అందుకు తగ్గట్టుగానే రామాయణలో సీతమ్మ తల్లిగా సూపర్ గా చేస్తుందని ఈ దీపావళికి థియేటర్స్ మొత్తం సీతమ్మ తల్లి నామ జాపంతో ఊగిపోవడం ఖాయమనే మాటలు భారతీయ సినీ సర్కిల్ లో నిత్యం శ్రీరాముడు సాక్షిగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె మాట్లాడిన మాటలతో ఎప్పట్నుంచో ఆమెపై ఉన్న అపవాదు నామరూపాలు లేకుండా పలాయనం చిత్తగించాల్సిన పరిస్థితి. ఆ విశేషాలేంటో చూద్దాం.
సాయి పల్లవి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాలుగేళ్ల క్రితం ఒక రిపోర్టర్ నుంచి మీ మలయాళ నటీనటులు తమిళం చాలా బాగా ఎలా మాట్లాడగలుగుతున్నారనే ప్రశ్న వచ్చింది. దాంతో నేను రిపోర్టర్ తో నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదని చెప్పాను. కానీ నేను చెప్పిన మాటలని వక్రీకరిస్తూ రెండు సంవత్సరాల తర్వాత ఒక పత్రికలో “మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది” అనే హెడ్‌లైన్ గా వచ్చింది. ఆ న్యూస్ చూసి షాక్ కి గురవ్వడంతో పాటు తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేయడం బాధ కలిగించింది. ఒక సారి ఎయిర్‌పోర్ట్‌లో ఒక మహిళ నాతో మాట్లాడుతూ 'మలయాళంలో మాట్లాడిన తర్వాత మీకు కోపం వస్తుందేమో అంది. వెంటనే ఆమెతో 'నాకు అలాంటి భావం ఎప్పుడూ లేదు అని చెప్పాను. కానీ ఆమె నమ్మలేదు.
భాషల విషయానికి వస్తే నాకు ఎలాంటి బేధాలు ఉండటం కానీ చిన్న చూపు చూడటం గాని జరగదు. నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలతో నాలుగేళ్ళ అపార్థం సిగ్గుతో తలని గోడకి కొట్టుకోవాల్సిన పరిస్థితి. సాయిపల్లవి అచ్చ తెలుగు తమిళ యువతి. 1992 మే 9 న కోయంబత్తూర్ లోని కోటగిరిలో జన్మించింది. 2015 లో వచ్చిన ప్రేమమ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడం,సదరు హిట్ కి సాయి పల్లవి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కావడం, ఆ తర్వాత వెంటవెంటనే మలయాళ సినిమాల్లో చేయడంతో అందరూ మలయాళీ ముద్దగుమ్మ అనుకున్నారు. అయినా కళకి ప్రాంతానికి సంబంధం ఉంటుందా.. అందం, అభినయం ప్రపంచ సినీ ప్రేక్షకుడి సొంతం.
![]() |
![]() |