![]() |
![]() |
సినీ పరిశ్రమలో విషాదం
త్రిపురనేని చిట్టిబాబు మరణం
ప్రముఖుల నివాళి
మరణానికి కారణం ఏంటి!
తెలుగు సినిమా పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది..తన పాటల ద్వారా, రచనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసిన లెజెండ్రీ రైటర్ త్రిపురనేని మహారధి కుమారుడు త్రిపురనేని చిట్టిబాబు మరణించడం జరిగింది.
నిన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. టీవీల్లో జరిగే అనేక చర్చా కార్యక్రమాల్లో తన గళాన్ని విప్పుతూ ఎంతో మందికి సుపరిచయస్తుడిగా మారారు. అసలు పేరు వరప్రసాద్ కాగా చిట్టిబాబుగానే ప్రసిద్ధుడు. వయసు 70సంవత్సరాలు.
కెరీర్ బిగినింగ్ లో తన తండ్రి వద్ద సహాయక దర్శకుడిగా పని చేసి సినిమా నిర్మాణంలోని మెళకువలను నేర్చుకున్నారు. 1984లో ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యి తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నార. ఆ తర్వాత వరుసగా నా పేరు దుర్గ, ప్రళయం, ప్రేమించి చూడు, రైతు భారతం వంటి వైవిధ్యమైన చిత్రాలని తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే నటుడిగానూ మెప్పించారు.
1976లో ‘గరుడాచలం’ చిత్రంతో ప్రారంభమైన ఆయన నట ప్రయాణం ఇటీవలి కాలం వరకు కొనసాగింది. భైరవ ద్వీపం, దశావతారం వంటి సినిమాలతో పాటు నేటి తరంలోను జాతిరత్నాలు, జాంబీరెడ్డి, దర్జా సినిమాల్లోను చేసారు. అయన మృతి పట్ల పలు సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషలు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. నిర్మాతగానూ కొన్ని చిత్రాలు నిర్మించాడు
![]() |
![]() |