![]() |
![]() |

టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు కలిసి నటించి మెప్పించారు. నేటి తరం హీరోలు కూడా దానిని కొనసాగిస్తున్నారు.
ఈ తరం స్టార్స్ లో మల్టీస్టారర్స్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో 'వార్-2'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్ కి మహేష్ బాబు(Mahesh Babu)తో మల్టీస్టారర్ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని గతంలో జయప్రదం టాక్ షోలో స్వయంగా ఎన్టీఆర్ రివీల్ చేయడం విశేషం.
ఎన్టీఆర్ మనసులో మాట
"మీరు ఒకవేళ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు?" అని అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ తడుముకోకుండా "మహేష్ బాబు" అని సమాధానమిచ్చారు. మహేష్ బాబును ఆయన ప్రేమగా 'మహేష్ అన్న' అని పిలుస్తుంటారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పవచ్చు.
‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ సాధ్యమేనా?
అదే ఇంటర్వ్యూలో తారక్ తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారని అడగ్గా, ఆయన "దాన వీర శూర కర్ణ" అని చెప్పారు. ఈ పౌరాణిక చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించడమే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు.
బెస్ట్ డైరెక్టర్ ఎవరు?
ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురిలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని అడగగా.. ఇది ఛండాలమైన ప్రశ్న అని (నవ్వుతూ), ఎందుకంటే ముగ్గురు బెస్ట్ అని తారక్ చెప్పారు. యాక్టర్ గా తనను ముగ్గురూ బాగా ప్రొజెక్ట్ చేశారని తారక్ అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఆశపడినట్టుగా మహేష్ బాబుతో మల్టీస్టారర్, ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ రెండూ జరగాలంటే అది రాజమౌళి వల్ల సాధ్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'. టాప్ స్టార్స్ తో మహాభారతాన్ని తెరకెక్కించాలి అనేది ఆయన ఆలోచన. అదే జరిగితే కృష్ణ, కర్ణ, అర్జున, దుర్యోధన వంటి పాత్రల కోసం ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
![]() |
![]() |