![]() |
![]() |

-ఇలాంటి సన్నివేశాలు అరుదుగా వస్తుంటాయి.
-అన్నలని అవమానించాలని మనసెలా వచ్చింది
-అసలు ఎందుకు అవమానించింది
ఫ్యామిలీ ఎమోషన్ తో కూడిన కొన్ని చిత్రాలని మనం మర్చిపోదామని అన్నా మరిచిపోలేం. అలాంటి ఒక చిత్రమే 'శివరామరాజు'(SIvaramaraju). 2002 లో వచ్చిన ఈ మూవీని నేటికీ చాలా మంది వీక్షిస్తూ తమ దగ్గర ఉన్న సినీ పన్నీటి జల్లులని చూసి మురిసిపోతుంటారు అన్నాచెల్లెళ్ళ అనుబంధం.. ఇచ్చిన మాట కోసం ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా అర్పించే గొప్ప ధైర్య శీలి.. ఇలా ఎన్నో అంశాలు శివరామరాజుని నిత్య సినీ యవ్వనుడిగా మార్చాయి. మరి ఈ మూవీలోని ఒక అద్భుతమైన సన్నివేశాన్ని చూద్దాం.
స్వాతికి శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. తన అన్నయ్యలు శివ రామరాజు, రామరాజు, రాజు వస్తారు. శివరామరాజు, రాజుకి పెళ్లవ్వడం వలన వెంట భార్యలు ఉంటారు. గొప్పింటి కుటుంబానికి చెందిన ఆ ముగ్గురు అన్మదమ్ములు స్వాతికి పెళ్లి చెయ్యడానికి తమ కోట్ల ఆస్థిని చెల్లెలకే రాసి ఇస్తారు. చెల్లెలంటే అంత ప్రేమ. ఇప్పుడు పేదవాళ్లుగా తమ శక్తీ కొలది చెల్లెలి శ్రీమంతానికి పుట్టింటి తరుపు నుంచి తీసుకురావాల్సినవి తీసుకొస్తారు. స్వాతి తన వాళ్ళందర్నీ ఆప్యాయంగా పలకరిస్తుంది. కానీ పెద్ద వదిన అక్షింతలు వేస్తుంటే మెడలో ఏమైనా నగలు వేసుకోవచ్చుగా, లేదంటే అరువు తీసుకోవచ్చుగా ఇలా వస్తే నాకే కదా అవమానం, త్వరగా వెళ్ళండి. ఒక విఐపి ఎదురుచూస్తున్నాడు అంటుంది. ఆ తర్వాత రెండో వదిన ని కూడా అవమానిస్తుంది. అన్నయ్య లేమో మనం ఒక రోజు ముందుగానైనా రాలేదని చెల్లళ్ళకి కోపం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ అన్నయ్యని ఎవరు అవమానించని రీతిలో స్వాతి అవమానించి' చాటుగా తిని వెళ్ళచ్చు కదా అని కూడా అంటుంది.
స్వాతి ఇప్పడు సామాన్యుడైన శివరామరాజు చెల్లెలు కాదురా. కోటీశ్వరుడైన నరేంద్ర వర్మ గారి కోడలు అని శివరామరాజు బాబాయ్ అనుకోని అక్కడ్నుంచి అందరు వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత తన అన్నయ్య లు వెళ్తుంటే ఎదురొచ్చి కన్నీటి పర్యంతమవుతూ తన అత్త ఇంటి వారు తన అన్నయ్యలని ఘోరంగా అవమానించాలని చూసారని, అలా జరిగితే నేను తట్టుకోలేనని అందుకే నేనే ఆ విధంగా మాట్లాడానని కన్నీటి పర్యంతమవుతూ చెప్తుంది. ఆ తర్వాత తన అన్నయ్య, వదిన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ సన్నివేశం చూస్తున్నంత సేపు కళ్ళ వెంట కన్నీళ్లు పెట్టుకోనోడు పాపాత్ముడు అనే విధంగా ఉంటుంది. అదే టైంలో స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుతాడు
స్వాతి ముగ్గురు అన్నయ్యలుగా శివరామరాజు, శివాజీ, వెంకట్ తమ పెర్ఫార్మ్ తో అన్నయ్య అనే వర్డ్ కి నిండు తనాన్ని తీసుకొచ్చారు.చెల్లెలుగా మోనికా సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది, లయ, పూనమ్, బ్రహ్మ్మనందం, సిజ్జు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ శివరామరాజు కోసమే సినీ లైఫ్ లోకి వచ్చామనే విధంగా పెర్ఫార్మ్ ఉంటుంది. సముద్ర(V. Samudra)దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. సముద్ర సగర్వంగా చెప్పుకునే మూవీ కూడా. ముఖ్యంగా ఆనంద భూపతి రాజుగా నందమూరి టైగర్ హరికృష్ణ(Harikrishna)పెర్ ఫార్మెన్స్ చూస్తే నోమాలు నిక్కపరుచుకుంటాయి. తల తీసి ఇచ్చే సీన్ అయితే ఒళ్ళు జలదరిస్తుంది.
Also read: Toxic: టాక్సిక్ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. వాయిదా పడినట్టేగా మరి
తమిళ మూవీ సముద్రం' కి రీమేక్ అయినప్పటికీ, మన తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా చాలా బాగా తెరకెక్కించారు. తెలుగు సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్‌కి కేరాఫ్ అడ్రస్ లాంటిది. ముఖ్యంగా ఎస్.ఏ. రాజ్‌కుమార్ గారి సంగీతం ఆ ఎమోషన్‌ని మరింత పెంచుతుంది. ఈ రోజుల్లో వస్తున్న సినిమాల్లో ఇలాంటి స్వచ్ఛమైన కుటుంబ అనుబంధాలు చూడటం కొంచెం తక్కువైపోయింది. అందుకే ఇలాంటి పాత క్లిప్స్ చూసినప్పుడు మన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసుకి హత్తుకుంటాయి. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఆర్ బి చౌదరి నిర్మించాడు. చాలా కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవం,శతదినోత్సవం జరుపుకుంది
![]() |
![]() |