![]() |
![]() |
.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ విషయంలో ఒక కనీవినీ ఎరుగని డీల్ సెట్ అయినట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్‌తో రూ. 700 కోట్ల భారీ డీల్?
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘స్పిరిట్’ సినిమా డిజిటల్ హక్కుల కోసం సుమారు రూ. 700 కోట్ల భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని భాషలకు (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) కలిపి ఈ ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం వెనుక ఒక రీజన్ ఉందట. ‘స్పిరిట్’ సినిమాకు శాటిలైట్ బిజినెస్ ఉండదని టాక్. థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో మాత్రమే అందుబాటులో ఉంటుందట. భవిష్యత్ లో శాటిలైట్ డీల్ చేయాలన్నా.. అది నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు.
‘స్పిరిట్’ సినిమాకు నెట్‌ఫ్లిక్స్ రూ.700 కోట్ల భారీ ఆఫర్‌ను ఇచ్చిందన్న వార్త నిజమైతే.. ఒక ఇండియన్ సినిమాకు లభించిన అత్యధిక ఓటీటీ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలవనుంది. సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఈ స్థాయిలో ఆఫర్లు రావడం ప్రభాస్ గ్లోబల్ మార్కెట్ స్టామినాను నిరూపిస్తోంది.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్
ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పోలీస్ క్యారెక్టర్ చాలా ‘రఫ్ అండ్ టఫ్’గా ఉండబోతోందట. ఒకవైపు నిజాయితీ గల ఆఫీసర్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్రే షేడ్స్ ఉన్న మాస్ అవతార్‌లో ప్రభాస్ అలరించనున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి నటిస్తుండగా, విలన్ పాత్రలో వివేక్ ఒబేరాయ్ కనిపించనున్నారు.
టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో 'స్పిరిట్' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మార్చి 5, 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |