![]() |
![]() |

-ఈ సారి తనకి కలిసొచ్చేనా
-గ్యారంటీగా లక్కీ హీరో
-తన ప్లేట్ మారబోతుందా!
ఎప్పుడో మరుగునపడిపోయిన 'లక్కీ హీరో' అనే వర్డ్ మళ్ళీ వెలుగులోకి వచ్చిందంటే అందుకు పుణ్యం కట్టుకున్న హీరో నస్లేన్(naslen)..ప్రేమలు, ఆలప్పుళ జింఖానా, కొత్త లోక ఛాప్టర్ 1 తదితర వరుస బ్లాక్ బస్టర్స్ నే ఉదాహరణ. మరి ఈ లెక్కన లక్కీ హీరో అనకపోతే సినిమానే అలిగే పరిస్థితి. అందుకే ఆ పరిస్థితి రాకుండానే నెటిజన్స్ తో పాటు, మూవీ లవర్స్ సైతం లక్కీ హీరో అంటు తన తదుపరి సినిమాల అప్ డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర న్యూస్ ఒకటి వాళ్లందరిలో జోష్ తెప్పిస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
బ్యాచిలర్ పార్టీ డీలక్స్( Bachelor Party D'eux).. నస్లేన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కాబోయే మూవీ. హీరోయిన్ గా సోషల్ మీడియాఇన్ ఫ్లూయెన్సర్ గా ఫుల్ క్రేజ్ ని పొందిన హన్సిక కృష్ణ(Hansika krishna) చేస్తుంది. హన్సిక ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె. ఈ మూవీలో నస్లేన్ గర్ల్ ఫ్రెండ్ గా రొమాన్స్ చేయబోతునట్టుగా తెలుస్తుంది. మరి అక్కడుంది నస్లేన్ కాబట్టి ఈ సారి హన్సిక తన పెర్ఫార్మ్ తో సౌత్ సినీ ప్రేమికుల హార్ట్స్ లో తన రూపాన్ని ఉంచుకోవడం ఖాయం. 2019 లో వచ్చిన లూకా అనే మూవీతో హన్సిక కృష్ణ మలయాళ సినీరంగ ప్రవేశం చేసింది.
Also read: Balakrishna: బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్!
బ్యాచిలర్ పార్టీ డీలక్స్ లో నస్లేన్, హన్సిక తోపాటుగా కున్చాకో బోబన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, షైన్ టోమ్ చాకో, నదియా మోయిదు, జ్యోతిర్మయి, రజిషా విజయం తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో చేస్తున్నారు. అమల్ నీరధ్ దర్శకుడు కాగా 2012 లో రిలీజై విజయదుంధుబి మోగించిన బ్యాచిలర్ పార్టీ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కుతోంది. నిత్య మీనన్ ప్రధాన క్యారక్టర్ లో కనిపించింది.

![]() |
![]() |