Home  »  News  »  Pawan Kalyan: బిగ్ సర్‌ప్రైజ్.. బ్రో సీక్వెల్ చేయబోతున్న పవన్ కళ్యాణ్!

Updated : Mar 26, 2026

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో ప్రేక్షకులను పలకరించారు. ఆయన తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కమిటై ఉన్నారు. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. మరోవైపు పవన్ 'ఓజీ-2' చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఊహించని విధంగా 'బ్రో-2' తెరపైకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ 'బ్రో'. 2023లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ని బాగా అలరించింది. పవన్ ని చూపించిన తీరుకి, ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు 'బ్రో' సినిమాకి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సముద్రఖని చెప్పడం విశేషం.

సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కార్మేని సెల్వం'(Carmeni Selvam). ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో 'బ్రో సీక్వెల్' గురించి సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

"బ్రో-2 స్టార్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తుంది" అని అడగగా.. "నేను కూడా వెయిట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే టేకాఫ్" అని సముద్రఖని చెప్పుకొచ్చారు.

సముద్రఖని కామెంట్స్ ని బట్టి చూస్తే.. బ్రో సీక్వెల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నారని, ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అర్థమవుతోంది.

'ఓజీ' సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి.. బ్రో సీక్వెల్ న్యూస్ బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు.

https://x.com/Theteluguone/status/2037112071830356224






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.