Home  »  News  »  Prabhas: ప్రభాస్ పై పవన్ హీరోయిన్ రాశి కీలక వ్యాఖ్యలు.. నేనైతే ఆ విధంగా చేయను

Updated : Mar 26, 2026

 


-పవన్ హీరోయిన్ రాశి గుర్తుంది కదా  
-ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాలా!r
-రాశి గురించి అభిమానులు ఏమంటున్నారు

ప్రభాస్(Prabhas).. ఆ కట్ అవుట్ కి ఉండే క్రేజ్ తాలూకు వెయిట్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే తుఫాన్ ని సృష్టించే కొత్త వర్డ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే నిత్యం  అదే పనిలో ఉంటు సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక తాజాన్యూస్ వాళ్ళ కంట పడటంతో ఆసక్తిగా గమిస్తుండటంతో పాటు కామెంట్స్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయికగా అనిపించుకున్న రాశి(Raasi)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతు 'ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇంతవరకు పర్సనల్ గా కలవలేదు. తన ఫస్ట్ పిక్చర్ 'ఈశ్వర్' ట్రైలర్ చూసినప్పుడే పెద్ద స్టార్ అవుతాడని భావించాను. ఛత్రపతి', 'బాహుబలి' సిరీస్ తో నా భావన నిజమైంది. తన సినిమాలు చూసేందుకు ప్రత్యేకంగా థియేటర్‌కి వెళ్తాను. ప్రభాస్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే  విషయానికి వస్తే అక్క, వదిన క్యారెక్టర్స్ అయితే ఓకే. తల్లిగా మాత్రం చేయను. 'మిర్చి'లో నదియాగారికి 'రాధే శ్యామ్'లోని ఒక క్యారక్టర్ కి డబ్బింగ్ చెప్పాను.

Also read: Raj tarun: మద్యం మత్తులో రాజ్‌తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్‌చల్.. పక్కా యాక్సిడెంట్ 

ఇక ప్రభాస్  మాట్లాడే తీరు, మేనరిజం, ఇతరులకు ఇచ్చే గౌరవం నాకు బాగా నచ్చుతాయి. 'బాహుబలి' సిరీస్ తర్వాత ఆయన ఇమేజ్‌ ని వేరేలా ఊహించుకోవడం కష్టమైంది. బాహుబలి క్యారక్టర్ లో తన రాజసం, స్క్రీన్ ప్రెజన్స్ నాకు ప్రత్యేకంగా అనిపిస్తాయని రాశి పేర్కొంది. దీంతో అభిమానులు స్పందిస్తు రాశి గారు మీరు భవిష్యత్తులో ప్రభాస్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నామనే కామెంట్స్ చేస్తున్నారు. అందం, అణుకువ, నిజాయితీ, స్వచ్చతతో కూడిన ఎన్నో క్యారెక్టర్స్ పోషించి  సెల్యులాయిడ్ పై హీరోల చేత మూడు చెరువుల నీళ్లు తాగించింది. అందుకు ఒక ఉదాహరణ   'గోకులంలో సీత'లోని పవన్ కళ్యాణ్. మరి రాశి సెకండ్ ఇన్నింగ్స్  స్టార్ట్ చేస్తుందేమో చూడాలి.



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.