Home  »  News  »  Kvn productions: మీకే ఎందుకిలా.. ఎలా తట్టుకుంటారో ఏమో 

Updated : Mar 4, 2026

 

-మూడు భారీ ప్రాజెక్ట్స్ 
-అన్ని ఆటంకాలే 
-సినీ ప్రియుల ఆశ ఏంటి 

కెవిఎన్ ప్రొడక్షన్స్(Kvn Productions).. కేవలం మూడంటే మూడే చిత్రాలతో ఇండియన్ చిత్ర పరిశ్రమ మొత్తం తనవైపు చూసేలా చేసుకుంది. ఆ మూడు చిత్రాలే జన నాయగన్, టాక్సిక్, చిరంజీవి, బాబీ ల మెగా 158 . వీటిల్లో జన నాయగన్ పొంగల్ కి రావాల్సి ఉంది. కానీ సెన్సార్ పరమైన సమస్యల వల్ల రిలీజ్ డేట్ విషయంలో ఖచ్చితమైన హామీ రాని పరిస్థితి. తాజాగా టాక్సిక్(Toxic) రిలీజ్ డేట్ ఈ నెల 19 నుంచి జూన్ 4 కి వాయిదా పడింది. చాలా లాంగ్ డేట్ అని చెప్పవచ్చు. గల్ఫ్ కంట్రీస్ లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణమే వాయిదాకి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రెజెంట్ ఏ ముగ్గురు సినీ లవర్స్ కలిసినా కేవిఎన్ ప్రొడక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలేంటో చూద్దాం.


జన నాయగన్ సుమారు 400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి పారలాల్ గానే యష్ తో టాక్సిక్ షూటింగ్ ని స్టార్ట్ చేసారు. సుమారు 600 కోట్ల బడ్జెట్. ఆర్ధిక వనరులు మొత్తం సమకూర్చుకునే రంగంలోకి దిగినా, జననాయగన్ (Jana Nayagan)రిలీజ్ తర్వాత వచ్చిన అమౌంట్ ని టాక్సిక్ కి యూజ్ చేసుకునే వారు. భారీ ఖర్చుతో కూడిన చిత్రాలు కాబట్టి ఫైనాన్స్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దీంతో  మధ్యలో  ఫైనాన్షియల్ ఇష్యు వచ్చినా జన నాయగన్ డబ్బులు సర్దుబాటు అయ్యేవి.  టాక్సిక్ బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులని చిరంజీవి(Chiranjeevi) బాబీ(Bobby)సినిమాకి సమకూర్చుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు టాక్సిక్ కూడా వాయిదాపడింది. పైగా జన నాయగన్ ,టాక్సిక్ కి రిలీజ్ కి ముందే వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ కి సంబంధించి అడ్వాన్స్ లు కూడా వచ్చే ఉంటాయి. వాళ్లందరికీ కూడా డబ్బు విషయంలో హామీ ఇవ్వాల్సిన పరిస్థితి. మరి  మెగా 158 షూటింగ్ కి సమస్య ఏర్పడవచ్చేమో. కానీ ఆ ఒడిదొడుకులన్నిటిని కేవిఎన్ ప్రొడక్షన్స్ ఎదుర్కోని చిరంజీవి, బాబీ మూవీని కెవిఎన్ ప్రొడక్షన్స్ నుంచే రావాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

also read: Vijay vs sangeeta: 250 కోట్ల డీల్ అంట.. విడాకులు వస్తాయా? రావా?
  
2021 వ సంవత్సరంలో ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూట్ రంగలోకి  కె విఎన్  ప్రొడక్షన్స్ అడుగుపుట్టింది. విచిత్రం ఏంటంటే కె విఎన్ లోనే నిర్మాణం జరుపుకున్న 'కెడి ది డెవిల్' కూడా వాయిదాల మీద వాయిదా పడుతూ మే నెలకి పోస్ట్ పోన్ కావడం గమనార్హం. ధ్రువ సర్జా హీరో.. టోటల్ గా 1000 కోట్ల రూపాయిలు బ్లాక్ అయ్యాయనే వార్తలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.