Home  »  News  »  Peddi: రామ్ చరణ్ రుద్రతాండవం.. రై రై పుట్టుకకి కారణం చెప్పిన అనంత్ శ్రీరామ్ 

Updated : Mar 4, 2026


-రికార్డు వ్యూస్ తో  రై రై  సాంగ్ 
-ఆసక్తి కర విశేషాలని పంచుకున్న అనంత్ శ్రీరామ్ 
-మీ కోసమే ఎక్స్ క్లూజివ్ గా 


స్టిల్ 'పెద్ది'(Peddi)లోని 'సెకండ్ సాంగ్' రై రై రారా'(Rai Raa Raa)తన ఊచకోతని ఒక రేంజ్ లోనే చేస్తుంది. ఎంతలా అంటే ఇప్పటి వరకు రికార్డు ప్లేస్ లో ఉన్న అన్ని సాంగ్స్ ఈర్ష్య, అసూయతో రగిలిపోయేంతలా. హెల్త్ దెబ్బతింటుందేమో అని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించుకుందామని అనుకున్నా మళ్ళీ రై రై రారా వినపడే పరిస్థితి ఉండటంతో మిన్నుకుండిపోయారు. ఈ విషయంలో పెద్ది ఫస్ట్ సింగల్ 'చికిరి' సాంగ్ కి మినహాయింపు లేదు. అసలు తెలుగు చిత్రసీమలో ఒక పాట విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించి, కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోందంటే మామూలు విషయం కాదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రుద్రతాండవం', ఏఆర్ రెహ్మాన్ 'శంఖారావం', దర్శకుడు బుచ్చిబాబు దార్శనికతకి అనంత శ్రీరామ్ కలం నుండి జాలువారిన అద్భుతమైన సాహిత్యం ప్రాణం పోసింది. 'రై రై రారా' సాంగ్  కేవలం వినడానికి మాత్రమే కాదు, ప్రతీ మధ్యతరగతి యువకుడిని ఉర్రూతలూగించే ఒక స్ఫూర్తి గీతం. రీసెంట్ గా మా తెలుగు వన్ తో  రై రై రారా ని రాసిన గీత రచయిత  అనంత శ్రీరామ్ (Anantha sriram)ముచ్చటించడం జరిగింది. సదరు ముచ్చట్లలో పాట వెనుక ఉన్న అసలు రహస్యాలు మరియు భావోద్వేగాలుని పంచుకున్నారు.

 
 ఆయన మాట్లాడుతు మండే గుండె.. మారుతున్న రక్తం! ఈ పాటలోని ప్రతి అక్షరం ఒక యుద్ధంలా సాగుతుంది. "పాతికేళ్లకే నువ్వు పాతపడిపోకురా" అనే లైన్ ఈ రోజుల్లో యువతకి ఒకహెచ్చరిక లాంటిది. మనం రోజూ తినే పప్పు టమాటా తింటూ, పాత అప్పులే కడుతూ ఉంటే మన జీవితంలో కొత్తదనం ఏముంది? "నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావు. మనిషికి కేవలం కండరాలు ఉంటే సరిపోదు, లోపల గెలవాలనే 'మండే గుండె' ఉండాలని రాసాను.

ఈ సాంగ్ రాయడానికి రెండు నెలల సమయం తీసుకున్నాను. బుచ్చిబాబు, నా మధ్య     'స్నేహపూర్వక యుద్ధం' జరిగిందని చెప్పవచ్చు. ఒకరిని మించి ఒకరు అద్భుతమైన భావాలను పంచుకుంటూ, ఏఆర్ రెహ్మాన్ అందించిన కొత్త ఓరవడి సంగీతానికి తగ్గట్టుగా 
పదాలని తీర్చిదిద్దాం. విశేషమేమిటంటే, ఇంత పెద్ద గ్లోబల్ సినిమాలో వచ్చే మొదటి పాటలో ఒక్క ఆంగ్ల పదం లేకుండా పూర్తి తెలుగు పదాలతో రాసాను. ఒక గొప్ప సాహసం చేశాను. 


ఇక ఈ సాంగ్ లో చరణ్ గారు చేసిన డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా హుక్ స్టెప్పులు అందరూ చేసేలా సులువుగా ఉంటాయి. కానీ చరణ్ గారిలోని పూర్తి సామర్థ్యాన్ని వాడాలని జానీ మాస్టర్ కఠినమైన స్టెప్పులని  డిజైన్ చేశారు. అన్నీ మనం చేయడానికి కాదు, కొన్ని మనం చూడడానికి ఉంటాయి. ఈ విషయాన్నీ రై రై రుజువు చేసింది. వైలిన్ బిట్ వచ్చినప్పుడు చరణ్ గారు వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్ళు ఆర్పడం  మర్చిపోతాం.

'పెద్ది' లాంటి సినిమా పది సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఒక గొప్ప సినిమా. ఈ నాలుగు నిమిషాల పాట ఇచ్చిన ఉద్వేగానికి వంద రెట్లు ఉద్వేగం మూడు గంటల సినిమాలో ఉంటుంది. తెలుగు భాషా మాధుర్యాన్ని, స్ఫూర్తిని రగిలించే ఇటువంటి పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకులకి కృతజ్ఞతలు. లిరిక్స్ , డ్యాన్స్  పోటీ పడుతున్నాయని, ఇంత మోటివేషనల్ సాంగ్ రావడం ఒక వరం లాంటిదని చరణ్ గారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇలా రై రై తో పాటి పెద్ది సంబంధించిన ఆసక్తి కర విషయాలని అనంత శ్రీరామ్ పంచుకున్నారు. తాను పెద్ది సిల్వర్ స్క్రీన్ పై కనపడటం లేదని కూడా చెప్పుకొచ్చారు. 

also read: కన్నడ హీరోయిన్ల సంచలన పోస్ట్.. ఆ టిప్పు సుల్తాన్ మాకు ఎప్పుడో తెలుసు 

 


మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు, అనంత శ్రీరామ్ గారి ఎనర్జిటిక్ ఇంటర్వ్యూ పూర్తి వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే మా యూ ట్యూబ్  ఛానల్ తెలుగు వన్  కి విజిట్ అవ్వండి. మరిన్ని సినీ విశేషాలు మీ కోసం వెయిటింగ్. సబ్ స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.  ఛానల్ మటుకు మార్చకండి.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.