![]() |
![]() |
- మహేష్, రాజమౌళి ఎందుకు కొట్టుకున్నారు?
- రామ్‌గోపాల్‌వర్మ వల్లే మహేష్, రాజమౌళి మధ్య ఫైట్
- ప్రస్తుతం ‘వారణాసి’ పరిస్థితి ఏంటి?
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రాజమౌళి మధ్య భీకర యుద్ధం జరిగింది. సినిమా యాక్షన్ సీన్‌ని మరిపించే స్థాయిలో ఇద్దరూ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు మహేష్, రాజమౌళి ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? వారిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆ వీడియో మాత్రమే చూసినవారు ఆసక్తిగా ఆరా తీశారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అది ఎఐ లో క్రియేట్ చేసిన వీడియో. దాన్ని పోస్ట్ చేసింది రామ్‌గోపాల్‌వర్మ.
ఇటీవలికాలంలో ఎఐ సష్టిస్తున్న విచిత్రాలు, విధ్వంసాలు మనం చూస్తున్నాం. నేచురల్‌గా కనిపించే కొన్ని వీడియోలు ఎఐ ద్వారా క్రియేట్ చేసినవి అని చెప్పేవరకు మనకు తెలీదు. అంత సహజంగా ఆ వీడియోలు ఉంటున్నాయి. అలాంటి ఓ వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేశారు. మొదటి నుంచీ ఎఐపై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన వర్మ.. చాలా ఇంటర్వ్యూల్లో దాని గురించి చర్చించారు. ఎఐను ఏ స్థాయిలో వినియోగించుకోవచ్చో తెలిపేందుకు మహేష్, రాజమౌళి మధ్య జరిగిన ఫైట్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ పోస్ట్‌కి ‘సినిమా ఈజ్ డెడ్’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
సాధారణంగా మన సినిమాల్లో హీరో, విలన్ ఎంత బీభత్సంగా కొట్టుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. టేబుల్స్ విరిగిపోతాయి. కొన్నిసార్లు గోడలు కూడా బద్దలైపోతాయి. ఆ స్థాయిలో మహేష్, రాజమౌళి మధ్య ఫైట్ జరిగింది. ఒకరిపై ఒకరు పవర్ఫుల్ పంచ్‌లు ఇచ్చుకుంటూ సినిమా యాక్షన్ సీన్‌ను మరిపించారు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పాజిటివ్, నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వర్మ ఇచ్చిన క్యాప్షన్‌కి రిప్లయ్ ఇస్తూ.. ఎఐ వల్ల సినిమా రంగమే కాదు అన్ని రంగాలూ డెడ్ అయ్యాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో భారత దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ జార్జియాకు బయల్దేరింది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ రిలీజ్ అవ్వని రేంజ్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ పతాకాలపై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ ‘వారణాసి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
![]() |
![]() |