Home  »  News  »  Ram Charan: రామ్ చరణ్ కి అండగా అల్లు శిరీష్.. ట్రోల్ల్స్ ఆగాయా!

Updated : Feb 24, 2026

 

-రీసెంట్ గా అయ్యప్ప మాలని ధరించిన రామ్ చరణ్ 
-హైదరాబాద్ లో అల్లు వారి ప్రీ వెడ్డింగ్ పార్టీ 
-మరి ట్రోల్ల్స్ ఎందుకు చేస్తున్నారు 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా విడుదల ఉన్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గా చరణ్ అయ్యప్ప స్వామి దీక్ష ధరించాడు. ఇటీవల కవల పిల్లలు పుట్టిన సందర్భంగా అయ్యప్ప స్వామికి కృతజ్నత తెలపడానినే దీక్ష తీసుకున్నట్టుగా తెలుస్తుంది.రెండు రోజుల క్రితం సదరు దీక్షలోనే చరణ్ ఒక ఫంక్షన్ కి  వెళ్లడంపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ డిటెయిల్స్ ఏంటో చూద్దాం.

అల్లు శిరీష్ వివాహం నైనికా రెడ్డితో మార్చి 6 న జరగనుంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో సన్నిహితులు, సినీ ప్రముఖుల కోసం ప్రైవేట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి రామ్ చరణ్, ఉపాసన హాజరయ్యారు. సదరు పార్టీలో లిక్కర్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి, అయ్యప్ప మాలలోని చరణ్ ఎలా వెళ్లాడని  ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో సదరు విషయంపై అల్లు శిరీష్(Allu Sirish)స్పందిస్తు 'చరణ్ స్వామి మేమందరం మద్యం తాగే ముందే వచ్చారు. మాకు శుభాకాంక్షలు తెలిపి వెళ్లిపోయారు. అయ్యప్ప స్వామిపై ఆయనకు ఉన్న అంకితభావం నాకెంతో నచ్చిందని సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. దీంతో ట్రోలర్స్ వేరే దారి చూసుకోవాల్సిన పరిస్థితి.

also read: Bloody Romeo: నాని, సుజిత్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. ఓజి కంటే బాగుందా!

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.