Home  »  News  »  Toxic: టాక్సిక్ టీజర్ వచ్చేసింది.. ఫకింగ్ మానర్స్ 

Updated : Feb 20, 2026

 


-టాక్సిక్ టీజర్ ఆగయా
-రిలీజైన నిమిషాల్లోనే రికార్డు వ్యూస్ 
-కేజిఎఫ్ సిరీస్ ని మించి ఉండబోతుందా!


'టాక్సిక్'(Toxic)ద్వారా వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ కి రాకింగ్ స్టార్ యష్ స్పాట్ పెట్టేసాడు.కొద్దీసేపటి క్రితం రిలీజైన టీజర్ తో ఈ విషయం క్లియర్ కట్ గా అర్ధమవుతుంది. టీజర్ అనే కంటే అణు విస్ఫోటనం అని చెప్పవచ్చు. నిమిషం నలభై ఎనిమిది సెకన్ల నిడివితో ఉన్న టీజర్ అణు విస్ఫోటనం లాంటి పదాలని ఉపయోగించే అవకాశాన్ని కల్పించింది. మరి టీజర్ లో ఏముందో ఒక లుక్ వేద్దాం. 


ఈ సారి యుద్ధం వేరు.. వాళ్ళ కుతంత్రాలు వేరు.. అందరితో విరోధం పెట్టుకొని బతకలేం.ఫకింగ్ మానర్స్ అనే మాటలతో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఆ సందర్భగా వస్తున్న సీన్స్ లోని కొన్ని షాట్స్, యష్ పెర్ ఫార్మ్ చూస్తుంటే అభిమానులకి, ప్రేక్షకులకి కేజిఎఫ్ సిరీస్ ని మించిన  అనుభూతి ఖాయమనే భరోసా దొరికినట్టుగానే భావించవచ్చు. యష్ ఒంటరి పోరాటం ఏ రేంజ్ లో ఉండబోతుందో కూడా అర్ధమవుతుంది.యాక్షన్ సీక్వెన్స్ కి సరికొత్త పేరు ఫిక్స్ చెయ్యడం ఖాయం. విజువల్స్ తో పాటు టోటల్ 24 క్రాఫ్ట్స్ పోటాపోటీగా టాక్సిక్ ని హై రేంజ్ లో ఉంచడానికి  పని చేశాయనే విషయంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. టీజర్ ని మీరు కూడా ఒకసారి చూస్తే  మార్చి 19 డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని డైలీ క్యాలండర్ ని చూస్తుండటం పక్కా. కథ, కథనంపై ఉన్న క్యూరియాసిటీ అంతకి అంత పెరిగింది.

also read:  Hey Balwanth Movie Review : హే బల్‌వంత్ మూవీ రివ్యూ
 
లేడీ డైనమిక్ డైరెక్టర్ గీతు మోహన్ దాస్(Geethu Mohandas)తెరకెక్కించగా  తార సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, టోమినో థామస్, సుదేవ్ నాయర్  స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అనిరుద్ రవిచందర్ నుంచి సాంగ్స్ రవి బసూర్ నుంచి  బిజిఏం రావడం స్పెషల్. యష్, కెవిఎన్ ప్రొడక్షన్స్ సుమారు 600 వందల కోట్ల బడ్జెట్ తో  నిర్మించాయి.

 







Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.