Home  »  News  »  Ntr: ఎన్టీఆర్ మూవీకి రామ్ చరణ్ టైటిల్! ఫ్యాన్స్ ఏమంటున్నారు 

Updated : Feb 19, 2026

 


-సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ 
-డ్రాగన్ ప్లేస్ లో ఆ టైటిల్ వచ్చిందా!
-రూమరా, నిజామా!
-ఇంతకీ ఆ టైటిల్ ఏంటి 


కొన్నిసార్లు రూమర్స్ అనేవి మూవీ లవర్స్ కి మంచి కిక్ ని ఇస్తాయి. ఇక అభిమానులకైతే చెప్పక్కర్లేదు. సదరు రూమర్ ఇచ్చే కిక్ స్థాయిని కొలవడం అత్యంత సాంకేతిక నిపుణుల బృందం వల్ల కూడా కాదు. దీంతో ఒక్కోసారి రూమర్ కోసమే  సోషల్ మీడియాని వెతికే పరిస్థితి వస్తుంది. తద్వారా రోజులు మారాయి ఒరిజినల్ బాబు అని రూమర్ సగర్వంగా లైక్స్ ని అందుకునే పనిలో బిజీ అవుతుంది. రూమర్ కి ఆ అధికార హోదా కల్పించింది మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)అప్ కమింగ్ మూవీ. అసలు మ్యాటర్ లోకి వెళ్దాం.

ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీని 'ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అరబ్ కంట్రీ 'జోర్డాన్‌'లో షూట్ జరుగుతుంది. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా అధికారంగా మాత్రం ధ్రువీకరించలేదు. ఇప్పుడు ఈ మూవీకి టైటిల్ గా 'బ్రూస్‌లీ'(Bruslee)పేరుని పరిశీలిస్తున్నట్టుగా సినీ సర్కిల్స్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. బ్రూస్‌లీ టైటిల్ తో  రామ్ చరణ్ (Ram Charan)నుంచి ఇప్పటికే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి అభిమానుల్లో సదరు రూమర్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మరి నిజంగానే ఎన్టీఆర్ మూవీకి బ్రూస్‌లీ టైటిల్ ని ఫిక్స్ చేస్తే ఆ ఇద్దరి అభిమానుల కంటే ఎక్కువగా సంతోషించే వారు ఉండరు. 

Also read: ది కేరళ స్టోరీ పార్ట్ 2 రిలీజ్..కేరళ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు 

మూవీ విషయానికి వస్తే పక్కా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ రేంజ్ ని హిమాలయాల శిఖరాల అంత ఎత్తుకి తీసుకెళ్లాలనే  పట్టుదలతో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ కింగ్ 'బ్రూస్‌లీ' లుక్ లో కూడా ఎన్టీఆర్ కనిపించబోతుండటంతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కి అయితే కొదవే లేదు.మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ కనివిని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తుండగా కాంతార చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణీ వసంత్(Rukmini vasanth)హీరోయిన్. రవి బస్రూర్ మ్యూజిక్ కాగా  2026 జూన్‌ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. 

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.