Home  »  News  »  ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు!

Updated : Feb 19, 2026

జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం 'ఫంకీ', 'కపుల్ ఫ్రెండ్లీ', 'సీతా పయనం' వంటి సినిమాలు విడుదల కాగా ఈ వారం 'హే బల్‌వంత్', 'నవాబ్ కేఫ్' సినిమాలు విడుదలవుతున్నాయి.

హే బల్‌వంత్: (Hey Balwanth)
సుహాస్, శివాని నగరం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హే బల్‌వంత్'. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెడుతోంది. అసలు ఈ చిత్ర టైటిల్ 'హే భగవాన్' కాగా.. సెన్సార్ అభ్యంతరం తెలపడంతో చివరి నిమిషంలో 'హే బల్‌వంత్'గా మార్చారు. హీరో ఫ్యామిలీ చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటి? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

నవాబ్ కేఫ్: (Nawab Cafe)
శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి కూడా మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విదేశాలకు వెళ్ళాలి, గొప్పగా బతకాలని కలలు కనే చాయ్ వాలా కొడుకు కథగా ఇది తెరకెక్కింది. 

ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు సందడి చేయనున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ చిదంబరం గారు వంటి సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి.

ఈటీవీ విన్:
శ్రీ చిదంబరం గారు మూవీ - ఫిబ్రవరి 19 

నెట్ ఫ్లిక్స్:
చథా పచ్చ మూవీ -  ఫిబ్రవరి 19 

ప్రైమ్ వీడియో:
'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' మూవీ - ఫిబ్రవరి 19

జీ5:
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ - ఫిబ్రవరి 20 
రాక్షస వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20 

జియో హాట్ స్టార్:
లక్కీ ది సూపర్ స్టార్ మూవీ - ఫిబ్రవరి 20 

Also Read: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.