![]() |
![]() |

'మన శంకర వరప్రసాద్ గారు' హిట్ తో మెగా ఫ్యాన్స్ ఖుషీ
ఇదే జోష్ లో మరో మూడు మెగా సినిమాలు
ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, విశ్వంభర తేదీలు ఖరారు!
2026 అనేది మెగా అభిమానులకు మరపురాని సంవత్సరంలా నిలిచిపోయేలా ఉంది. ఇప్పటికే చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై.. వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మెగా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి సంతోషాన్ని రెట్టింపు చేస్తూ.. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో మరో మూడు మెగా సినిమాలు విడుదల కాబోతున్నాయి.
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్(Pawan Kalyan), హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ యొక్క షూటింగ్ ను ఇప్పటికే పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు. ఈ సినిమాని మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్(Ram Charan) హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఫిల్మ్ 'పెద్ది'(Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను మొదట మార్చి 27న విడుదల చేయాలి అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తికాక పోవడంతో.. కొత్త విడుదల తేదీగా మే 1ని లాక్ చేసినట్లు సమాచారం.
ఇక 'విశ్వంభర'(Vishwambhara) విషయానికొస్తే.. ఇది 'మన శంకర వరప్రసాద్ గారు' కంటే ముందు రావాల్సిన సినిమా. చిరంజీవి(Chiranjeevi) హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ షూటింగ్ పూర్తయినప్పటికీ, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇప్పుడు జులై 10 కి రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే మూడు మెగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి 'మన శంకర వరప్రసాద్ గారు' తరహాలోనే ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాయేమో చూడాలి.
Also Read: చిరంజీవి కొత్త సినిమాకి ఊహించని టైటిల్!
![]() |
![]() |