![]() |
![]() |

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో 'అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) ఒకటి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కామెడీతో పాటు చివరిలో ఎమోషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా నవీన్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడనే పేరు వచ్చింది.
సంక్రాంతి సీజన్ కావడంతో పాటు, పాజిటివ్ టాక్ కూడా రావడంతో 'అనగనగా ఒక రాజు' మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. మేకర్స్ తెలిపిన దాని ప్రకారం.. మూడు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.60 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.22 కోట్ల గ్రాస్ సాధించిన అనగనగా ఒక రాజు.. రెండో రోజు రూ.19.2 కోట్లు, మూడో రోజు రూ.19.9 కోట్లతో సత్తా చాటింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఒక యంగ్ హీరో నటించిన సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం మామూలు విషయం కాదు.
Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ
![]() |
![]() |