![]() |
![]() |

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. వారిలో కొందరు సినీ ప్రముఖులు కూడా ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత నాగవంశీ ముందు వరుసలో ఉంటారు. తాజాగా ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన 'అనగనగా ఒక రాజు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా మూవీ టీమ్ 'థాంక్యూ మీట్'ని నిర్వహించగా.. అందులో నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి నాగవంశీ మాట్లాడుతూ.. "72 గంటల నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా సోషల్ మీడియాలో ఒకటే డ్యూటీ చేస్తున్నారు. ఆ ఫ్యాన్ బాయ్స్ ఎవరి ఫ్యాన్సో.. మీ అందరికీ బాగా తెలుసు. ఇంకో వారం, పది రోజులు మన ఫ్యాన్ బాయ్స్ సపోర్ట్ ఇలాగే కొనసాగితే ఇంకా పెద్ద విజయం సాధిస్తాం. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్ లో ఇవ్వాలి నాకు బాగా తెలుసు. త్వరలోనే అనౌన్స్ చేస్తాము." అన్నారు.
Also Read: ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి మరణ మాస్ అప్డేట్!
కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కుమారస్వామి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని గతంలో నాగవంశీ చెప్పారు. అయితే ఇటీవల మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కి వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో చిన్న సస్పెన్స్ నెలకొంది. ఇప్పుడు దానికి చెక్ పెడుతూ.. త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ హింట్ ఇచ్చేశారు నాగవంశీ.
Also Read: 'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ
![]() |
![]() |