![]() |
![]() |

-నిన్న సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయిన రవితేజ
-సంక్రాంతి పందెంలో నిలబడతాడా!
-టాక్ ఎలా ఉంది.
-ట్రేడ్ వర్గాలు చెప్తున్న కలెక్షన్స్ ఇవేనా!
సంక్రాంతి పందెంలో మై హునా అంటూ నిన్న 'మాస్ మహారాజా రవితేజ'(Ravi Teja)సిల్వర్ స్క్రీన్ పై ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi)తో అడుగుపెట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తనలాంటి సాటి భర్తలకి రామ సత్యనారాయణ క్యారక్టర్ ద్వారా ఏం చెప్పాలని అనుకున్నాడో, చాలా స్పష్టంగా చెప్పాడనే అభిప్రాయాన్ని మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు చెప్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ క్యారక్టర్స్ తో పాటు హీరోయిన్ ఆషికా రంగనాధ్(Ashika Ranganath)పోషించిన మానస శెట్టి క్యారక్టర్ కూడా బాగా పేలిందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala)నుంచి ఎంటర్ టైన్ మెంట్ కోణంలో వచ్చిన డైలాగులు బాగా పేలేయనే టాక్ వినపడుతుంది. మరి ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
సినీ ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం మొదటి రోజు 5 కోట్ల రూపాయిల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. రవితేజ గత చిత్రం మాస్ జాతర డే 1 కలెక్షన్స్ తో పోల్చితే కొంచం తక్కువ అయినప్పటికీ, సంక్రాంతి బరిలో చిరంజీవి, ప్రభాస్ వంటి స్టార్స్ ని తట్టుకొని 5 కోట్లు సాధించడం విశేషం అనే చెప్పాలి. పైగా వరుస ప్లాప్ ల్లో ఉన్న రవితేజ కి ఆ స్థాయి కలెక్షన్స్ ఊరటనిచ్చే అంశం. అభిమానులు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. చిత్ర బృందం మాత్రం ఇంకా కలెక్షన్స్ వివరాలని అధికారకంగా ప్రకటించలేదు.
Also read: టాక్సిక్ పై చర్యలు మొదలవుతాయా!.. యష్ కి ఊహించని దెబ్బ ఖాయమేనా!
ప్రస్తుతం రివ్యూస్ తో పాటు మెజారిటీ ప్రేక్షకుల నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఒక మోస్తరు పాజిటివ్ టాక్ నే వినపడుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ తో పాటు లాంగ్ రన్ కలెక్షన్స్ పై ఆసక్తి నెలకొని ఉంది. రవితేజ సరసన మరో హీరోయిన్ డింపుల్ హయతి(Dimple Hayathi)జత కట్టగా నాచురల్ స్టార్ నాని తో దసరా వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. వరుస హిట్ ఆల్బమ్స్ తో దూసుకెళ్తున్న భీమ్స్(Bheems)సంగీత సారధ్యంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సంగీత సొగసుల్ని హద్దుకోవడం జరిగింది.
![]() |
![]() |