![]() |
![]() |
ఇటీవలికాలంలో సైబర్ మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. ఏమీ తెలియని అమాయకులే కాదు.. విద్యావంతులు, వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు సైతం వారి వలలో చిక్కుకొని లక్షల్లో నష్టపోతున్నారు. అలాంటి ఓ మోసంలో ప్రముఖ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ చిక్కుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సైబర్ క్రైమ్‌లో అమితవ్ రూ.63 లక్షలు మోసపోయాడు.
చిత్రం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తేజ.. ఆ తర్వాత ఎన్నో ప్రేమకథా చిత్రాలతో టాప్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఈమధ్యకాలంలో జోరు తగ్గించిన తేజ.. అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. తండ్రి బాటలో సినిమాల్లోకి రాకుండా వ్యాపార రంగంలో రాణిస్తున్న అమితవ్‌ను హైదరాబాద్ మోతి నగర్‌కు చెందిన దంపతులు ట్రేడింగ్ పేరుతో మోసం చేశారు. అతని దగ్గర నుంచి 63 లక్షల రూపాయలు కాజేశారని తెలుస్తోంది.
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్‌లపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు అమితవ్‌కు పరిచయమయ్యారు. ట్రేడింగ్‌లో డబ్బు పెడితే భారీ మొత్తంలో లాభాలు వస్తాయని అమితవ్‌ను నమ్మించారు. ఒకవేళ నష్టం వస్తే.. తాము నివాసం ఉంటున్న ఫ్లాట్ ఇచ్చేస్తామని నమ్మబలికారు. వారి మాటల్ని గుడ్డిగా నమ్మిన అమితవ్ 63 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత వారి మోసం బయటపడడంతో పోలీసులను ఆశ్రయించాడు అమితవ్.
![]() |
![]() |