![]() |
![]() |

-సుష్మ భూపతి ఏం చెప్తుంది
-25000 ఎందుకు!
-అదిరిపోయే సమాధానం
సినీ సెలబ్రటీస్ ని సైతం తన వద్దకి రప్పించుకునే శక్తి సోషల్ మీడియా సొంతం. తన సెలబ్రటీస్ ని సినీ సెలబ్రటీస్ గా కూడా మార్చే శక్తి కూడా సోషల్ మీడియా సొంతం. ఇందుకు ఉదాహరణగా ప్రభాస్, హను రాఘవపూడి ల ఫౌజీ లో చేస్తున్న ఇమాన్వీ ని చెప్పుకోవచ్చు.ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. చాలా మంది సోషల్ మీడియా సెలబ్రటీస్ పాన్ ఇండియా వ్యాప్తంగా సినీ అవకాశాలు పొందుతు వస్తున్నారు. ఈ కోవలోనే ప్రముఖ సోషల్ మీడియా సెలబ్రటీ సుష్మా భూపతి సినిమాల్లో అవకాశాలు సంపాదించే ఛాన్స్ ఉందనే మాటలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి. అంతలా తన డాన్స్ వీడియోస్ తో అభిమానులని అలరిస్తూ వస్తుంది. సోషల్ మీడియా స్టేటస్ సింబల్ తో పలు ప్రమోషన్స్ కి కూడా హాజరవతు తన సత్తా చాటుతుంది. అదే టైంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తుందనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఆ వార్తలపై రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్ వ్యూ లో సుష్మ చెప్పిన మాటలు వైరల్ గా నిలిచాయి.
సుష్మ తో యాంకర్ మాట్లాడుతు సుష్మ ఇరవై ఐదు వేల రూపాయలు లేకుండా ఏ పని చేయదు.ఆ అమౌంట్ ఇస్తే ఎలాంటి ప్రమోషన్ అయినా చేస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయని అడిగింది. సుష్మా మాట్లాడుతు ఈ ఇంటర్ వ్యూ కి రావడానికి నువ్వు నాకు ఎంత ఇచ్చావు? ఏమి ఇవ్వలేదు కదా. మరి ఇరవై ఐదు వేలు తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి.? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి.? ఒక యూట్యూబర్ ఇటీవల ఆ ఆరోపణలు సృష్టించాడు.నేను ప్రమోషన్ల కోసం డబ్బులు తీసుకొని డాన్స్ లు చేస్తుంది అనే మాటల్లో ఎలాంటి నిజం లేదు. నేను అలాంటివి చేయను. ప్రమోషన్స్ చేయడం వల్ల వచ్చినవే తీసుకుంటాను. కానీ డిమాండ్ చేయను అని సుష్మ చెప్పు కొచ్చింది.
Also Read: vanaveera : వన వీర మూవీ రివ్యూ
వృత్తిరీత్యా టీచర్ అయిన సుష్మా తొలుత ఒక్క డాన్స్ స్టెప్ తో పాపులర్ అయ్యింది. ఆ ఒక్క డాన్స్ స్టెప్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి.ఆమె అభిమానులు సుష్మ సినిమాల్లో కూడా తన సత్తా చాటాలని కోరుకుంటున్నారు.
![]() |
![]() |