![]() |
![]() |

టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.
ఇటీవల విడుదలైన బ్లడ్ రోజస్ టీజర్ ను చూసి నటులు సుమన్, అజయ్ ఘోష్, హైపర్ ఆది చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. టీజర్ ఆసక్తికంగా ఉందని, ఫిబ్రవరి 6న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ మూవీ విజయం సాధించాలని వారు కోరారు.
బ్లడ్ రోజస్ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కింది. త్వరలో ఈ చిత్ర ట్రైలర్ లను విడుదల చేయబోతున్నారు. దర్శకుడు ఎంజిఆర్ ఈ సినిమాను గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా రూపొందిచినట్లు చిత్ర బృందం తెలిపింది.

ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి హీరో హీరోయిన్లు గా నటిస్తోన్న ఈ సినిమాలో సుమన్, ఘర్షణ శ్రీనివాస్, టార్జన్, శ్రీలు, క్రాంతి కిల్లి, రాజేంద్ర, జూనియర్ రేలంగీ, జగదీశ్వరి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ ఓగిరెడ్డి శివకుమార్, ఎడిటర్ గా రవితేజ సిహెచ్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |