![]() |
![]() |

-ఎందుకు సూసైడ్ చేసుకుంది
-లెటర్ లో ఉన్న పేర్లు నిజమేనా!
-ఎంతో భవిష్యత్తు ఉంది
-తీవ్ర ఆవేదనలో తోటి నటులు, ఫ్యాన్స్
తమిళంలో టెలికాస్ట్ అవుతున్న'గౌరీ'(Gowri)అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన నటి 'నందిని'(Nandini). ఈ సీరియల్ లో దుర్గ, కనక అనే డ్యూయల్ రోల్ లో ఆమె ప్రదర్శిస్తున్న నటనకి ఫిదా కానీ తమిళ బుల్లితెర ప్రేమికులు లేరంటే అతిశయోక్తి కాదు. కన్నడ లోను జీవ హెవాగిడే, సంఘర్ష, మధుమగలు, నీనడే వంటి ఫేమస్ సీరియల్స్ లో కనిపించి కన్నడ టీవీప్రేక్షకులని కూడా మెప్పిస్తూ వస్తుంది. అటువంటి నందిని ఆకస్మిక మరణం ఇప్పుడు ఎంటైర్ దక్షిణ టీవీ ఇండస్ట్రీ వర్గాలని ఉలిక్కి పాటుకి గురి చేస్తుంది.
నందిని నిన్న బెంగుళూరు(Bengaluru)లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తను సూసైడ్ చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరు లేరని భావిస్తున్నారు.కానీ సంఘటన స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సదరు సూసైడ్ నోట్ లో 'యాక్టింగ్ కెరీర్‌లో కొనసాగాలని నందిని భావించినా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేయడంతో, నందిని విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్లడం వల్లే సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లుగా రాసి ఉందనే వాదనలు సర్క్యులేట్ అవుతున్నాయి. పోలీసులు సదరు సూసైడ్ నోట్ ప్రకారమే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని కూడా బెంగుళూరు మీడియా వర్గాల్లో న్యూస్ హల్ చల్ చేస్తుంది.
Also read: అగ్ర హీరో కూతురు బాడీ పై ట్రోల్స్.. చేస్తుంది వీళ్లేనా!
గౌరీ సీరియల్ తమిళ సీరియల్ అయినా మొదట నుంచి బెంగుళూరులోనే షూట్ జరుగుతుంది. కానీ షూటింగ్ ఇటీవల బెంగుళూరు నుంచి చెన్నైకి షూటింగ్ మారడంతో, కొన్ని రోజుల నుంచి అక్కడే షూటింగ్ జరుగుతుంది. కానీ బ్రేక్ రావడంతో నందిని బెంగుళూరు వచ్చి ఆత్మహత్యకి పాల్పడింది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తునట్టుగా టాక్ . ఇక నందిని మరణంపై అభిమానులు, కో యాక్టర్స్ సోషల్ మీడియా వేదికగా తమ దిగ్భ్రాంతి ని వ్యక్తం చేస్తున్నారు. గౌరీ ని నిర్మిస్తున్న 'కలైంజర్' టీవీ నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తీవ్ర సంతాపం తెలియజేసింది. నందిని ఆంధ్రప్రదేశ్ కి చెందిన అచ్చ తెలుగమ్మాయి.
![]() |
![]() |