![]() |
![]() |

టాలీవుడ్ లో ఎన్నికల సందడి నెలకొంది. నేడు(డిసెంబర్ 28) ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. (Film Chamber Elections)
ఫిల్మ్ ఛాంబర్ లో నాలుగు సెక్టార్లు భాగమయ్యాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్స్ కలిపి మొత్తం 3,355 మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష కార్యదర్శిలతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యుల ఎంపిక జరగనుంది. ఈ సారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు సభ్యులు.
ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఛాంబర్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు అంతా కలిసి మన ప్యానల్ గా, అగ్ర నిర్మాతల వర్గమంతా ప్రోగ్రెసివ్ ప్యానల్ గా బరిలోకి దిగారు. మన ప్యానల్ ను బలపరుస్తున్న వారిలో సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ లాంటి వారు ఉండగా.. ప్రోగ్రెసివ్ ప్యానల్ ను బల పరుస్తున్న అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారున్నారు.
మరి ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో చిన్న నిర్మాతలు పైచేయి సాధిస్తారో లేక పెద్ద నిర్మాతలు పైచేయి సాధిస్తారో చూడాలి. మరి కొద్ది గంటల్లో ఫలితం తేలనుంది.
![]() |
![]() |