![]() |
![]() |
![]()
-ఏంటి ఆ మూవీ
-హీరో ఎవరు
-ఎప్పుడు రిలీజ్
-వారణాసి అప్ డేట్ ఏంటి
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి(SS Rajamouli)ది అగ్ర స్థానం అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ఈ సారి తన రికార్డుల్ని తానే బద్దలు కొట్టేలా 'వారణాసి'(Varanasi)ని ముస్తాబు చేస్తున్నాడు. ఇండియన్ చిత్ర సీమలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటుండగా మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ తో పాటు తన కెరీర్ లో ఒక మర్చిపోలేని మూవీగా నిలిచిపోయేలా చెయ్యాలనే కంకణంతో చిత్రీకరిస్తున్నాడు. అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు 'వారణాసి' ని చూద్దామా అనే ఆశతో ఉన్నారు. కానీ వాళ్ల ఆశ ఫలించటానికి రెండు సంవత్సరాలు ఆగాల్సిందే. కానీ రాజమౌళి అప్పటి దాకా తన అభిమానుల్ని బాధపెట్టడం ఎందుకని వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ పై తాను ఇప్పటి దాకా వదిలిన బాణాల్లోని ఒక బాణాన్ని మరోసారి రీ రిలీజ్ చేయనున్నాడు.
రాజమౌళి, నాని(Nani),సమంత(Samantha), సుదీప్ కాంబోలో వచ్చిన ఈగ(Eega)ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. 2012 లో వచ్చిన ఈ మూవీలో నటీనటుల పెర్ ఫార్మెన్స్, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, గ్రాఫిక్స్ ఒకదానికొకటి పోటీపడి మరి మెస్మరైజ్ చెయ్యడంతో ప్రతి ఒకరు ఎంతగానో ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు వారణాసి టీం నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
also read: అనసూయకి సలహా ఇస్తున్న ప్రకాష్ రాజ్.. వినలేదంటున్న శివాజీ

![]() |
![]() |