![]() |
![]() |

తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పై లెజండ్రీ యాక్టర్స్ నటకిరీటి 'రాజేంద్రప్రసాద్'(Rajendraprasad),కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam)కి ఉన్న చరిష్మా తెలిసిందే. ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి సదరు క్యారెక్టర్స్ ని అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో సజీవ రూపంగా నిలిచేలా చెయ్యడంలో ఆ ఇద్దరు స్పెషలిస్ట్స్. అందుకే మోస్ట్ వాంటెడ్ నటులుగా మారారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరి కాంబో కి మంచి క్రేజ్ ఉంది.
ప్రస్తుతం ఈ ఇద్దరు 'స:కుటుంబానాం' అనే కొత్త చిత్రంలో కలిసి చేస్తున్నారు. రీసెంట్ గా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఇద్దరు హాజరయ్యారు. సదరు ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం అని రాజేంద్ర ప్రసాద్ అనగానే బ్రహ్మనందం అందుకొని ఎంత మాట్లాడినా మీ శిష్యులమే కదా అని అన్నాడు. ఆ తర్వాత బ్రహ్మ్మనందం ని ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతు ఎంతైనా నువ్వు ముసలి ముండా కొడుకువి కదా అని అన్నాడు. వెంటనే మళ్ళీ బ్రహ్మానందం అందుకొని ఎవరు అనగానే నేను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ప్రస్తుతం ఈ మాటల తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక స:కుటుంబానాం(Sahakutumbaanaam)చిత్రం డిసెంబర్ 12 న రిలీజ్ కి సిద్ధమవుతుండగా రామ్ కిరణ్, గిరిధర్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్ లుగా కనిపిస్తున్నారు. ఉదయ్ శర్మ(Uday sharma)దర్శకుడు కాగా హెచ్ ఎన్ జి సినిమాస్ నిర్మిస్తుంది.
![]() |
![]() |