![]() |
![]() |

బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్ ఎవరంటే రష్మీ గౌతమ్ మాత్రమే గుర్తొస్తుంది. ఇక ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా హోస్ట్ చేస్తూ ఉంది. అలాంటి రష్మీ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది. ఒక దొప్పలో కూర్చుని పింక్ కలర్ లో ఉన్న తామర పువ్వును ఎవరికో ఇస్తూ సిగ్గుపడుతున్న పిక్స్ ని పోస్ట్ చేసింది. "ఈ తామర పువ్వు నీకు..అరచేతిలో దాచుకునే ముఖం నాకు..నేను నా పింక్ సాక్స్...క్రేజి మార్నింగ్, క్రేజి మెమోరీస్" అంటూ ఒక పింక్ తామర పువ్వును ఎవరికో ఇస్తున్నట్టు కనిపించింది యాంకర్ రష్మీ. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ ఐతే "ఆ ప్రకృతి అందం అంతా మీలోనే ఉంది.
పువ్వుతో ఒక ఏంజెల్, ఎంత క్యూట్ గా ఉందొ రష్మీ గౌతమ్, సుధీర్ అన్న ఎక్కడ, ఒక ఫ్రేమ్ లో రెండు తామర పువ్వులు, మీరు మేకప్ లేకుండా నే బాగున్నారు మేడం, రష్మీ అక్క మీరు నేచురల్ బ్యూటీ...నీకు తామర పువ్వు ఇస్తున్నది ఎవరు ? తామర పువ్వు కూడా ఈర్ష పడుతుంది మేడం మిమ్మల్ని చూసి " అంటూ కామెంట్స్ చేశారు. రష్మీ గౌతమ్ బుల్లితెర మీద సుధీర్ తో కలిసి ఎన్నో షోస్ ని హోస్ట్ చేసింది. దాంతో ఈ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకునే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఐతే తర్వాత వీళ్ళు ఎవరికీ వారు విడిపోయి వేరే వేరే షోస్ కి వెళ్లిపోయారు. ఇప్పుడు రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీని హోస్ట్ చేస్తోంది. సుధీర్ మాత్రమే మూవీస్ లో నటిస్తున్నాడు అలాగే జీ సరిగామప చేస్తున్నాడు. అలాగే ఇంకొన్ని షోస్ కి గెస్ట్ గా వెళ్తున్నాడు.
https://www.instagram.com/p/DRmWeelErkq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
![]() |
![]() |