![]() |
![]() |

ఇస్మార్ట్ శంకర్ తో 'రామ్ పోతినేని'(Ram Pothineni)తన అభిమాన గణాన్ని, ప్రేక్షాభిమానాన్ని భారీగా పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రెడ్ ,ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలతో విజయాన్న అందుకోలేకపోయాడు. దీంతో రామ్ కి హిట్ రావాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra KIng Taluka)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు.ఉదయం 8 గంటలకే షోస్ ప్రారంభం కావడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ భారీగానే థియేటర్స్ కి పోటెత్తారు.
వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా 'ఆంధ్ర కింగ్ తాలూకా' పై స్పందిస్తు ఎంటైర్ మూవీ మొత్తానికి రామ్ పెర్ ఫార్మెన్స్ హైలెట్. లవర్ బాయ్ గా, హీరో కోసం తన ప్రేమని త్యాగం చేసే అభిమానిగా, పుట్టిన ఊరి కోసం పరితపించే యువకుడిగా రామ్ నటన సూపర్ గా ఉంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)తో లవ్ సీన్స్ మెప్పించాయి. ఉపేంద్ర తో వచ్చిన క్లైమాక్స్ సీన్, వరదల్లో గ్రామం మునిగిపోయేటప్పుడు వచ్చే సీన్స్ అయితే సూపర్. ముఖ్యంగా కథ కూడా మరో ప్రధాన హైలెట్. క్లైమాక్స్ లో రామ్ ని ఉద్దేశించి ఉపేంద్ర(Upendra)మాట్లాడుతు 'నిజమైన ఆంధ్ర కింగ్ వి నువ్వే' అనడం థ్రిల్లింగ్ గా అనిపించిందని అభిమానులు,ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
రివ్యూస్ పరంగా చూసుకున్నా దాదాపుగా అన్ని మీడియా సంస్థలు పర్వాలేదనే రివ్యూస్ నే ఇస్తున్నాయి. దీంతో అభిమానులు హ్యాపీగా ఉన్నారు. మరి ముందు ముందు ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందో, కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయో చూడాలి. పి మహేష్ బాబు(P.Mahesh Babu)దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సుమారు అరవై కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించింది.
![]() |
![]() |