![]() |
![]() |

చరిత్రలో చాలా మంది ఉంటారు
చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే
మరోసారి గర్జించిన బాలయ్య
'వీరసింహారెడ్డి' వంటి ఘన విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపారు. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్.. బుధవారం హైదరాబాద్ లో ఘనంగా లాంచ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డైలాగ్ ఒకటి వైరల్ గా మారింది.
బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ డైలాగ్ లకు పెట్టింది పేరు. పైగా హిస్టారికల్ ఫిల్మ్ కావడంతో డైలాగ్ లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకు శాంపిల్ అన్నట్టుగా ఓపెనింగ్ రోజే.. బాలయ్య ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు.
"చరిత్రలో చాలా మంది ఉంటారు.. చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే.. అదే ఈ చరిత్ర.. నాదే ఆ చరిత్ర..." అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పై ముహూర్తపు షాట్ ని చిత్రీకరించారు. ఇప్పుడు ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: అఖండ-2 ఇంటర్వెల్.. ఏం హై రా బాబు...
'NBK111'లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక రోల్ లో పవర్ ఫుల్ కింగ్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాణిగా నయనతార నటిస్తోంది.
కాగా, డిసెంబర్ 5న 'అఖండ-2'తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలకృష్ణ.
![]() |
![]() |