![]() |
![]() |

కన్నడ సినీ చరిత్రలో రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన రెండవ సినిమాగా 'కాంతార చాప్టర్ 1' నిలిచింది. 2022లో విడుదలైన 'కేజీఎఫ్ 2' మొదటిసారి ఈ ఫీట్ సాధించింది. ఆ సినిమా ఫుల్ రన్ లో రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1' మొదటి వారంలోనే రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి, విజయవంతంగా ప్రదర్శిమవుతోంది. (Kantara Chapter 1)
2022 బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'కాంతార'కి ప్రీక్వెల్ గా రూపొందిన 'కాంతార చాప్టర్ 1'.. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.89 కోట్ల గ్రాస్ రాబట్టిన 'కాంతార చాప్టర్ 1'.. అదే జోరుని కొనసాగిస్తూ మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది. వారం రోజుల్లో ఈ సినిమా రూ.509.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

2022 లో వచ్చిన 'కాంతార' ఫుల్ రన్ లో రూ.400 కోట్ల గ్రాస్ రాబడితే.. 'కాంతార చాప్టర్ 1' వారం రోజుల్లోనే రూ.500 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఫుల్ రన్ లో రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశముంది.
నిజానికి ఈ సినిమాకి రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టే సత్తా ఉంది. అయితే విడుదలకు ముందు భారీ ప్రమోషన్స్ చేయకపోవడం వల్ల.. ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది. లేదంటే మొదటి వారం రూ.600 కోట్ల క్లబ్ లో చేరి ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
![]() |
![]() |